కరోనా ఎఫెక్ట్‌.. శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో లాక్‌డౌన్‌

| Edited By:

Jul 20, 2020 | 10:29 AM

కరోనా ఎఫెక్ట్‌ నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని(షార్‌) తాకింది. షార్‌లో కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా ఎఫెక్ట్‌.. శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో లాక్‌డౌన్‌
Follow us on

కరోనా ఎఫెక్ట్‌ నెల్లూరులోని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని(షార్‌) తాకింది. షార్‌లో 4 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు సిబ్బంది ఉండగా.. మరో రెండు వారి కుటుంబ సభ్యులు. దీంతో శ్రీహరి కోటలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షార్‌లో లాక్‌డౌన్‌ కొనసాగనుంది. వాటర్‌, కరెంట్‌, ఫైర్‌ అవసరాలు మినహా అక్కడ అన్ని సేవలు బంద్‌ కానున్నాయి. అలాగే ఆ ప్రదేశం మొత్తాన్ని శానిటైజ్‌ చేశారు. ఇదిలా ఉంటే కరోనా సోకిన ఇద్దరు విధులకు హాజరయ్యారు. దీంతో మరికొంతమందికి ఈ వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు వారి కాంట్రాక్ట్‌లను గుర్తించిన అధికారులు, వారికి టెస్ట్‌లు చేయించినట్లు తెలుస్తోంది.