నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో వీరమరణం చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్

Edited By:

Updated on: Jun 22, 2020 | 8:10 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో వీరమరణం చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే సంతోష్ బాబు త్యాగాన్ని స్మరిస్తూ ఆయన కుటుంబానికి గౌరవ సూచకంగా  రూ.5 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన కేసీఆర్.. తాజాగా చెక్, సంతోష్ బాబు సతీమణి సంతోషికి గ్రూప్ వన్ ఉద్యోగం, ఇంటి స్థలం పత్రాలను వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందించనున్నారు. ఇక సీఎం రాక సందర్భంగా సూర్యాపేటలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా నేపథ్యంలో జనాలు గుమికూడకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. సంతోష్ బాబు కుటుంబం నివాసం ఉంటోన్న విద్యానగర్ కాలనీ మొత్తాన్ని సోడియం హైపో క్లోరోడ్ ద్రావణంతో మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేసింది.

Read This Story Also: జమ్ములో నలుగురు ఉగ్రవాదులు హతం