అరుదైన శస్త్రచికిత్స: చిన్నారి కడుపులో సూది.. 8 నిమిషాల్లో తీసేసిన వైద్యులు

| Edited By:

Feb 26, 2020 | 4:57 PM

గుంటూరు జీజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్ల చిన్నారి పొట్టలో నుంచి సూది బయటకు తీశారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం గమనర్హం.

అరుదైన శస్త్రచికిత్స: చిన్నారి కడుపులో సూది.. 8 నిమిషాల్లో తీసేసిన వైద్యులు
Follow us on

గుంటూరు జీజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్ల చిన్నారి పొట్టలో నుంచి సూది బయటకు తీశారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం గమనర్హం.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని పొత్తూరు వారి తోటకు చెందిన మహ్మద్ అబెదుల్లా, సాజియా దంపతుల నాలుగేళ్ల కుమార్తె షీమా ఆడుకుంటూ ఆడుకుంటూ చేతికి అందిని సూదిని మింగేసింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు సూది చిన్నారి కడుపులో పేగులకు అతుక్కొని ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ కవితకు తెలియజేయగా.. మంగళవారం ఆపరేషన్ చేసిన ఆమె చిన్నారి కడుపులో నుంచి సూదిని బయటకు తీశారు. ఎండోస్కోపీ ద్వారా ఈ సూదిని విజయవంతంగా బయటకు తీసినట్లు డాక్టర్ కవిత వెల్లడించారు.