Breaking: 50ఏళ్ల వ్యక్తితో 10ఏళ్ల చిన్నారి పెళ్లికి సిద్ధం.. ఈ లోపే!

| Edited By:

Feb 18, 2020 | 2:23 PM

ఆడపిల్లలను భారంగా భావించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు ఓ తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. మరో దారుణం జరగకుండా ఆగిపోయింది. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో పదేళ్లు కూడా నిండని ఓ […]

Breaking: 50ఏళ్ల వ్యక్తితో 10ఏళ్ల చిన్నారి పెళ్లికి సిద్ధం.. ఈ లోపే!
Follow us on

ఆడపిల్లలను భారంగా భావించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు ఓ తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. మరో దారుణం జరగకుండా ఆగిపోయింది. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. 50ఏళ్ల మాధవాచారి అనే వ్యక్తికి ఆ చిన్నారిని ఇవ్వాలనుకున్నారు. ఇక ఆ బాలికను వివాహం చేసుకునేందుకు మాధవాచారి ఆమె తల్లిదండ్రులకు ఎదురు కట్నం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ఆ నోటా.. ఈ నోటా పడి గ్రామస్తులందరికీ తెలిసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న వారు చిన్నారిని బాలసదన్‌కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులను, మాధవాచారి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.