AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?

రాష్ట్ర నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 892 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1 సర్వీసులకు 163 పోస్టులుకాగా.. ఇతర విభాగాలకు 729 పోస్టులు ఉన్నాయి. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు..

APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
APPSC Recruitment Notifications
Srilakshmi C
|

Updated on: Sep 17, 2026 | 8:26 AM

Share

అమరావతి, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 892 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1 సర్వీసులకు 163 పోస్టులుకాగా.. ఇతర విభాగాలకు 729 పోస్టులు ఉన్నాయి. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్ జాబితాలో కొన్ని పోస్టుల్లో మార్పులు చేశారు. గతంలో జాబితాలో ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పోస్టును తొలగించారు. అలాగే గతంలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (DPO) స్థానంలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DLDO) పోస్టును చేర్చారు. ఇక కొత్తగా గ్రూప్ 1 సర్వీసెస్ జాబితాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) కమ్యూనికేషన్స్, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులను చేర్చారు.

APPSC విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లలో గ్రూప్-1తో పాటు ఫారెస్ట్, మహిళా అభివృద్ధి-శిశు సంక్షేమం, పరిశ్రమలు, జువైనైల్ వెల్ఫేర్, ఎండోమెంట్స్, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, గిరిజన సంక్షేమం, ఆర్థిక-గణాంకాలు, సోషల్ వెల్ఫేర్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం APPSC అధికారిక నోటిఫికేషన్ జాబితాలో Notification No.07/2026 నుంచి 26/2026 వరకు పలు రిక్రూట్‌మెంట్ ప్రకటనలు వెలువడ్డాయి. సాధారణ అభ్యర్థులకు వర్తించే గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వయోపరిమితి కారణంగా గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి కూడా కొత్త నోటిఫికేషన్ల ద్వారా అవకాశం లభించనుంది.

ఇవి కూడా చదవండి

జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో APPSC ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, ఇతర నిబంధనలను సంబంధిత నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్లు, సిలబస్, పరీక్షల షెడ్యూల్, దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయి.

Follow Us
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?
కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?
‌52 సిక్సర్లతో 892 పరుగులు.. సూర్య రికార్డ్‌పై కన్నేసిన ఇషాన్..!
‌52 సిక్సర్లతో 892 పరుగులు.. సూర్య రికార్డ్‌పై కన్నేసిన ఇషాన్..!