ఏపీలో ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు.. హైకోర్టు స్టే

| Edited By:

Nov 02, 2020 | 3:22 PM

ఏపీలో ఇంటర్మీడియట్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నిర్వహణ అంశంపై దాఖలైన పిటిషన్‌ని

ఏపీలో ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు.. హైకోర్టు స్టే
Follow us on

Online Intermediate Admissions: ఏపీలో ఇంటర్మీడియట్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నిర్వహణ అంశంపై దాఖలైన పిటిషన్‌ని న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది తమకు మరింత సమయం కావాలని విఙ్ఞప్తి చేశారు. దీంతో ఈ నెల 10 వరకు స్టే ఇస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని‌ హైకోర్టు ఆదేశించింది. ( ఆర్జీవీ ‘దిశ’కు మరో ఎదురుదెబ్బ)

దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను నిర్వహిస్తున్నారని న్యాయవాది అన్నారు. ఆన్‌లైన్‌లో అడ్మిషన్ వల్ల పిల్లలు భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ ప్రక్రియ ఉందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏ రూల్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నారని న్యాయశాఖ విద్యాశాఖను ప్రశ్నించింది. పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయొద్దని జస్టిస్‌ వెంకట రమణ అన్నారు. ( నాపై ప్రభాస్‌కి క్రష్‌ ఉండేదట: భాగ్యశ్రీ)