రమేష్ ఆసుపత్రిపై సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం
విజయవాడ రమేష్ ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పది మంది కరోనా బాధితుల మృతికి కారణమైన ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు

Swarna Palace Accident: విజయవాడ రమేష్ ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పది మంది కరోనా బాధితుల మృతికి కారణమైన ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఆసుపత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని, వారి నిర్లక్ష్యం వలనే కరోనా బాధితులు చనిపోయారని పిటిషన్‌లో పేర్కొంది. దర్యాప్తుకు రమేష్ ఆసుపత్రి యాజమాన్యం సహకరించడం లేదని, నిందితుడు రమేష్ ఇంకా పరీరాలోనే ఉన్నారని ఆ పిటిషన్‌లో వెల్లడించింది. దర్యాప్తుపై స్టే విధించడం వలన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, దర్యాప్తుకు కూడా ఆటంకం కలుగుతోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో వివరించింది.
కాగా విజయవాడ రమేష్ ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ కోవిడ్ సెంటర్‌లో ఆగష్టు 9న జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సమయంలో గవర్నర్‌పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, ఛైర్మన్ ఎం.సీతారామ్మోమన్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారిని అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరిగే అవకాశం ఉంది.
Read More:



