Breaking News : మందుబాబులకు గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన లిక్కర్ ధర

ఏపీలో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌. చీప్‌ లిక్కర్‌ ధరలు భారీగా తగ్గాయి. పక్క రాష్ట్రాల నుంచి చీప్‌ లిక్కర్‌ అక్రమ రవాణా పెరిగిపోయిన నేపథ్యంలో... వాటి ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బీర్లపై బాటిల్‌కు 30 రూపాయలు తగ్గించింది.

Breaking News : మందుబాబులకు గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన లిక్కర్ ధర
Follow us

|

Updated on: Sep 03, 2020 | 5:19 PM

ఏపీలో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌. చీప్‌ లిక్కర్‌ ధరలు భారీగా తగ్గాయి. పక్క రాష్ట్రాల నుంచి చీప్‌ లిక్కర్‌ అక్రమ రవాణా పెరిగిపోయిన నేపథ్యంలో… వాటి ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బీర్లపై బాటిల్‌కు 30 రూపాయలు తగ్గించింది. అదే సమయంలో ప్రీమియం లిక్కర్‌ ధరలను మాత్రం బాగా పెంచింది.

దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం ధరల్ని సవరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 180 ఎంల్ బాటిల్ ధర రూ.120 మించని బ్రాండ్లకు రూ. 30 నుంచి రూ.120 రూపాయల వరకూ తగ్గించింది. క్వార్టర్ బాటిల్ ధరను రూ. 120 నుంచి రూ.150 వరకూ ధర ఉన్న బ్రాండ్లకు రూ.30 నుంచి రూ. 280 వరకూ తగ్గించింది. క్వార్టర్ బాటిల్ రూ. 150 నుంచి రూ. 190 మధ్య ఉన్న బ్రాండ్లకు ఎలాంటి ధర మార్పులు చేయలేదు. అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపయాల మేర ధర తగ్గించింది. రెడీ టూ డ్రింక్ మద్యం పై రూ. 30 మేర తగ్గింపు నిచ్చింది.

ఇవాల్టి నుంచే సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలు సవరించాలని SEB ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ సేవనంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయని ఎస్ఈబీ తన నివేదికలో పేర్కొంది. దీన్ని అరికట్టేందుకు ధరలు సవరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.