లక్షలాది విద్యార్థుల ఉత్కంఠకు తెర.. AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్!
AP EAPCET 2026 Result Date and Time: రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాలు వచ్చే సోమవారం (జూన్ 22) విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు గురువారం (జూన్ 18) విడుదల కానున్నాయి. ఇవి విడుదలైన మూడు రోజుల..

అమరావతి, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాలు వచ్చే సోమవారం (జూన్ 22) విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు గురువారం (జూన్ 18) విడుదల కానున్నాయి. ఇవి విడుదలైన మూడు రోజుల తర్వాత అంటే జూన్ 22న ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈఏపీసెట్‌లో 25 శాతం ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ రెండో ఏడాది విద్యార్ధుల మార్కుల మెరుగుదలకు ప్రభుత్వం ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలు వస్తేగానీ ఈఏపీసెట్‌లో ర్యాంకుల నిర్ణయం కాదు. అందువల్లనే ఈ మార్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈఏపీసెట్ పలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్ చేసుకోచ్చు.
కాగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ పరీక్షలను మే 20 వరకు నిర్వహించారు. ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,55,803 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,29,474 మంది అంటే 92.60 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్, ఫార్మసీకి సంబంధించిన ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలకు 2,76,576 మంది దరఖాస్తు చేయగా.. 2,58,545 మంది (93.48 శాతం) పరీక్ష రాశారు.
ఇక వ్యవసాయ, ఫార్మసీకి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ పరీక్షలకు 79,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇందులో 70,929 (89.53 శాతం) మంది హాజరయ్యారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల ప్రక్రియ కారణంగా ఫలితాలను వాయిదా వేశారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి జూన్ 22వ తేదీన ప్రకటించాలని భావిస్తుంది.




