AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ తండ్రి ధైర్యానికి హ్యాట్సాఫ్.. సింహం నోటి నుంచి కుమార్తెను ఎలా కాపాడాడో చూడండి

Lion Attack at Zoo video: ఆకలితో ఉన్న ఓ సింహం అకస్మాత్తుగా ఓ చిన్నారిపై దాడి చేసి, అమాంతం పట్టేసుకుంది. బోను చువ్వల నుంచి పంచా బయటకు పెట్టగా.. అతి దగ్గరగా ఉన్న చిన్నారిని సింహం ఒడుపుగా పట్టుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భీతావాహకంగా మారింది. అయితే చిన్నారి పక్కనే ఆమె తండ్రి ఉండటంతో

Watch Video: ఆ తండ్రి ధైర్యానికి హ్యాట్సాఫ్.. సింహం నోటి నుంచి కుమార్తెను ఎలా కాపాడాడో చూడండి
Lion Attack Incident At Zoo
Srilakshmi C
|

Updated on: Jun 18, 2026 | 10:55 AM

Share

జూ పార్క్‌లో జరిగిన ఓ భయంకరమైన సంఘటన సందర్శకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆకలితో ఉన్న ఓ సింహం అకస్మాత్తుగా ఓ చిన్నారిపై దాడి చేసి, అమాంతం పట్టేసుకుంది. బోను చువ్వల నుంచి పంచా బయటకు పెట్టగా.. అతి దగ్గరగా ఉన్న చిన్నారిని సింహం ఒడుపుగా పట్టుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భీతావాహకంగా మారింది. అయితే చిన్నారి పక్కనే ఆమె తండ్రి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అక్కడున్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ఈ వీడియోలో సందర్శకులతో కిటకిటలాడుతున్న జూని చూడవచ్చు. అక్కడ సింహాల బోను వద్ద కొందరు సందర్శకులు అతి దగ్గరగా నిలబడి ఉండటం వీడయోలో కనిపిస్తుంది. తండ్రితో కలిసి జూకు వచ్చిన ఓ చిన్నారిని అనూహ్యంగా బోనులోని సింహం దాడి చేసింది. సింహం అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించింది. సింహం ఒక్కసారిగా చేసిన ఈ చర్యతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఏమి జరుగుతుందో అర్థంకాక సందర్శకులు భయంతో స్థంభించిపోయారు. ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన చిన్నరి తండ్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అలర్ట్ అయ్యాడు. ప్రాణాలకు తెగించి ముందుకు దూసుకెళ్లి తన కుమార్తె కాలును పట్టుకుని సింహం నుంచి లాగేందుకు దానితో పెనుగులాడాడు. చివరకు సింహం పంజా నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతని అప్రమత్తత, ధైర్యసాహసాల వల్ల అతి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

ఇవి కూడా చదవండి

చిన్నారిపై సింహం దాడి చేసిన వీడియో ఇక్కడ చూడండి

View this post on Instagram

A post shared by streetchapri (@streetchapri)

ఈ ఘటన కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగినప్పటికీ అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. చిన్నారి క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తండ్రి ధైర్యాన్ని, తెగువను పలువురు ప్రశంసించారు. ఘటన అనంతరం జూ సిబ్బంది వెంటనే స్పందించి సందర్శకులను శాంతింపజేశారు. అడవి జంతువులు నియంత్రిత వాతావరణంలో ఉన్నప్పటికీ వాటి సహజ స్వభావం ఎప్పుడు ఎలా బయటపడుతుందో చెప్పలేమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. సహజ ప్రవృత్తులు గల వణ్య మృగాల దగ్గర ఉన్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం అవసరమని ఈ సంఘటన రుజువు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారిని కాపాడిన తండ్రి సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. చిన్నారి తండ్రి ధైర్యమే ఈ పరిస్థితి విషాదంగా ముగియకపోవడానికి కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు.

Follow Us