స్కూళ్లు తెరిచే సమయానికి ఆ పనులన్నీ పూర్తి కావాలి: జగన్‌

ఏపీలో సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

స్కూళ్లు తెరిచే సమయానికి ఆ పనులన్నీ పూర్తి కావాలి: జగన్‌

Edited By:

Updated on: Aug 04, 2020 | 4:43 PM

AP CM review on Naadu Nedu: ఏపీలో సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు-నేడుపై ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూళ్లు తెరిచేనాటికి నాడు-నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని అన్నారు. స్కూళ్లు తెరిచే రోజున విద్యార్థులకు ఇవ్వనున్న ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌ను జగన్ పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌ క్లాత్‌ అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం‌.. వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి, ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశానంతరం ఆది మూలపు సురేష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 5న పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామని అన్నారు. మొదటి దశ నాడు-నేడు పనులు దాదాపుగా పూర్తయ్యాయని మంత్రి వివరించారు. కాగా నాడు నేడు మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలను బాగు చేయనుండగా.. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు.

Read This Story Also: మరో సెన్సేషనల్ డైరెక్టర్‌ని లాక్ చేసుకున్న మైత్రీ సంస్థ!