చెత్తే కదా అని లైట్‌గా తీసుకోవద్దు.. టచ్ చేస్తే.. సిరంజీల డొంక కదిలింది.. గంజాయి గుప్పు మంది. ఔను.. సాయంత్రమైందంటే చాలు దువ్వాడ రైల్వే స్టేషన్ , తుంగ్లం కు వెళ్లే ప్రధాన రహదారిలో సందడే సందడి. ఇక్కడున్న ఈ స్క్రాప్ షాప్ దగ్గరకు రేసు గుర్రాల్లా బైకుల్లో..కార్లలో దూసుకు వస్తారు యూత్. అలాగని ఛాయ్ పే చర్చ కోసం కాదు.. ఇక్కడ దొరికే మత్తు కోసం. సూటిగా చెప్పాలంటే .. స్క్రాప్ షాప్ మాటున డ్రగ్ దందా నిర్వహిస్తున్న వైనం తాజాగా బయటపడింది. విశాఖ అల్లిపురం ప్రాంతానికి చెందిన మహేశ్వర్ అనే వ్యక్తి ఈ షాప్‌ను రన్ చేస్తున్నాడు. చూడ్డానికి చిత్తు పేపర్లు..చెత్త సామాను కన్పిస్తాయి. కానీ చెత్తు మాటున మత్తు దందా మస్త్ మస్త్‌గా సాగుతోందిక్కడ. నిషాను నరాలకెక్కించే పెంట జోసైన్ లాక్టేట్ ఇంజక్షన్లు… .. ఒళ్లు జిల్లుమన్పించే గంజాయి పౌడర్.. పైసా మై మత్తాత్మ.. క్యాష్ కొడితే మత్తు సరుకు రెడీ మేడ్.
ఎన్నాళ్లుగా ఈ దందా జరుగుతుందో కానీ.. రీసెంట్‌గా జరిగిన ఓ యాక్సిడెంట్ ఘటనతో మత్తు లోగుట్టు తెరపైకి వచ్చింది. యాదవ జగ్గరాజుపేటకు చందన ఇద్దరు యువకులు,.. పాత వడ్లపూడి రోడ్ లో బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ఎలా జరిగింది? ఆరా తీస్తుండగా స్థానికుల దృష్టి స్క్రాప్ షాప్ వైపు మళ్లింది. లోనికి వెళ్లి చూస్తే గంజాయి వాసన గుప్పు మంది. ఖాకీలొచ్చి సోదా చేస్తే పెంట జోసైన్ లాక్టేట్ ఇంజక్షన్లు…మత్తు ఇంజెక్షన్లు.. గంజాయి పౌడర్ బయటపడ్డాయి. చెత్త చాటున మత్తుదందాపై నిలదీస్తే నీళ్లు నమిలారు నిందితులు..
చెత్త షాప్‌కు కొద్ది దూరంలో వున్న ఆగి వున్న కారును చెక్ చేస్తే..అందులోనే నిషా సరుకు బయటపడింది. కూపీలాగితే వెస్ట్ బెంగాల్ నుంచి డ్రగ్స్‌ను తెప్పించుకొని దందా చేస్తున్నట్టు తేలింది. నిందితులు నక్క మహేశ్వర్ రెడ్డి, మండి చైతన్య, శ్రీరామ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు . 30 రూపాయిల చొప్పున ఇంజక్షన్ కొని.. 2వందలు.. 3 వందల చొప్పున విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. మూలాలపై దృష్టి సారించారు విశాఖ పోలీసులు. మరోవైపు కూపీలాగే కొద్దీ మహేశ్వర్ రెడ్డి మత్తు దందా డొంకలు కదలుతున్నాయి. గతంలోనూ ఇతనిపై పలుకేసులున్నాయి. . ఒకవైపు యాదవ జగ్గరాజుపేటలో ఈ మత్తు ఇంజక్షన్ల కలకలం రేగితే… గంటల వ్యవధిలోనే వన్ టౌన్ లో నల్ల మందు దందా తెరపైకి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..