ఏపీలో ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు

| Edited By:

Sep 07, 2020 | 2:01 PM

ఏపీలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పునరుద్ధరణ, అభివృద్ధి డ్యామ్‌ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కి సంబంధించి రెండు

ఏపీలో ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు
Follow us on

Andhra Pradesh Projects: ఏపీలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పునరుద్ధరణ, అభివృద్ధి డ్యామ్‌ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కి సంబంధించి రెండు, మూడో విడత అమలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పథకం కింద 31 సాగునీటి ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు రూ.778కోట్ల వ్యయం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు సీడబ్ల్యూసీకి రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా జలాశయాల స్పిల్‌వే నుంచి లీక్ అవుతున్న నీటిని అరికట్టేందుకు పునాదిలో ఏర్పడిన పగుళ్లను మూసివేయడం లాంటివి చేస్తారు. ఒకవేళ లీకేజీలు మరీ ఎక్కువగా ఉంటే స్పిల్‌ వేకు జియో మెంబ్రేన్ షీట్ అమర్చుతారు. అలాగే స్పిల్‌ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఏర్పాటు చేసిన హాయిస్ట్‌లను మరమ్మత్తులు చేయనున్నారు. గేట్లు పూర్తిగా పాడైతే, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. అలాగే జలాశయాల్లో చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధి పనులు చేపడతారు.

Read More:

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్

నితిన్‌ ‘రంగ్‌దే’కు అదిరిపోయే ఆఫర్‌..!