పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అస్వస్థతకు గురయ్యారు. మిర్యాలగూడలోని తన నివాసంలో ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన అంత్యక్రియలు మిర్యాలగూడలో జరిగాయి. ఈ నేపథ్యంలో తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటికకు చేరుకున్న అమృతకు నిరాశే ఎదురైంది. అమృత గో బ్యాక్ అంటూ మారుతీ రావు బంధువులు, స్థానికులు నినాదాలు చేయడంతో.. ఏమీ చేయలేక, తండ్రి చివరి చూపు చూడకుండానే ఆమె వెనుదిరిగి వచ్చేసింది. ఆ తరువాత మాట్లాడుతూ.. మారుతీ రావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. మరో కారణంతో ఆయన ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.
Read This Story Also: మధ్యప్రదేశ్‌లో అత్యవసర భేటీకి బీజేపీ పిలుపు..!