ఏపీలో ఆగిన 108 సేవలు

| Edited By:

Jul 24, 2019 | 12:50 PM

ఏపీలో ఎమెర్జెన్సీ సేవలకు బ్రేకులు పడ్డాయి. తమ డిమాండ్ల సాధన కోసం 108 ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 439 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుకు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్స్ ఉద్యోగుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలని వారు.. డిమాండ్ చేస్తున్నారు. సమ్మె విరమణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. దీంతో సమ్మెను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే 108 […]

ఏపీలో ఆగిన 108 సేవలు
Follow us on

ఏపీలో ఎమెర్జెన్సీ సేవలకు బ్రేకులు పడ్డాయి. తమ డిమాండ్ల సాధన కోసం 108 ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 439 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుకు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్స్ ఉద్యోగుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలని వారు.. డిమాండ్ చేస్తున్నారు. సమ్మె విరమణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. దీంతో సమ్మెను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అయితే 108 ఉద్యోగులతో ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం చర్చించారు. వారి డిమాండ్లలో ప్రధానమైన జీతాల సమస్యలను పరిష్కరించేందుకు ఆమోదం తెలిపారు. మిగిలిన డిమాండ్లపై ఈ నెల 31న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేద్దామన్న అధికారులు.. అప్పటివరకు సమ్మె విరమించాలని కోరారు. అయితే అధికారుల ప్రతిపాదనను 108 ఉద్యోగులు అంగీకరించలేదు. దీంతో సమ్మె నేడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. తమ సమస్యలను సీఎం జగన్‌కు తెలిపే అవకాశం కల్పించే వరకు నిరసన కొనసాగిస్తామని 108 ఉద్యోగులు ప్రకటించారు.