Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!

|

Mar 10, 2022 | 12:17 PM

సాధారణంగా సముద్రంలో సాంప్రదాయ మత్స్యకారులు పట్టే చేప ఎన్ని కిలోలు ఉంటుంది..? పది.. ఇరవై.. యాభై.. మహా అయితే వంద కిలోలు.. అంతేనా..?! కానీ విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకి... ఓ భారీ టేకు చెప చిక్కింది.

Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!
Teku Chepa
Follow us on

Vizag: సాధారణంగా సముద్రంలో సాంప్రదాయ మత్స్యకారులు పట్టే చేప ఎన్ని కిలోలు ఉంటుంది..? పది.. ఇరవై.. యాభై.. మహా అయితే వంద కిలోలు.. అంతేనా..?! కానీ విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు… ఓ భారీ టేకు చెప చిక్కింది. దాని బరువెంతో తెలుసా..? అక్షరాలా వెయ్యి కిలోలు..!. వివరాల్లోకి వెళ్తే..  విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. సాంప్రదాయ పడవలో సముద్రంలో వేట చేస్తున్నారు. సముద్రంలో కొంచెం దూరం వెళ్ళాక.. వలకు ఓ భారీ చేప తగిలినట్టు అనిపించింది. చూసే సరికి అది భారీ టేకు చేప..! భారీ కాయంతో బరువు వెయ్యి కిలోల వరకు ఉంటుంది. దాన్ని పడవలో ఎక్కించేందుకు చెమటోడ్చారు. కానీ ఫలితం దక్కలేదు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు చేసేదిలేక ఆ చేపకు పెద్ద తాడు కట్టి దాన్ని పడవకు చుట్టి ఒడ్డుకు చేర్చారు. ఒడ్డు నుంచి బయటకు తేవాలన్నా తీవ్రంగా శ్రామించ్చాల్సి వచ్చింది. స్థానిక మత్స్యకారుల సాయంతో ఆ భారీ టేకు చేపను బయటకు లాగారు. మున్నెన్నడూ లేని విధంగా ఎంత భారీస్థాయిలో రేపు చేప చిక్కడంతో మత్స్యకారులు అంతా వింతగా చూశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో దాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. దీన్ని విక్రయిస్తే సుమారు రూ.40 వేల వరకు వస్తుందని చెబుతున్నారు. భారీ సైజు ఉండే టేకు చేపలు సముద్రంలోనే పెరుగుతుంటాయి. సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అరుదైన చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.

 

ఖాజా, వైజాగ్

Also Read: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన