Vizag Girl Death Case Update: వైజాగ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక(14) కేసుపై సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియా సమావేశంలో నిందితుడు కార్పెంటర్ నరేష్ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. బాలిక ఎదురింటిలో నివాసముంటున్న కార్పెంటర్ దిగుమర్తి నరేష్ తో ఏర్పడిన పరిచయం ప్రమాదకరంగా మారిందని అన్నారు. మైనర్ బాలికకు, నరేష్ లు తరచుగా ఫోన్ చూసుకునేవారని.. ఇద్దరి మధ్య 117 ఫోన్ కాల్స్ ఉన్నాయని అంతేకాదు అనేక మెసేజెస్ ఉన్నాయని చెప్పారు మనీష్ కుమారు. ఇక ఇద్దరి ఇల్లులు ఎదురెదురుగా ఉండడంతో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఇద్దరూ ప్రైవేట్ గా అనేకసార్లు కలిశారని తెలిపారు. బాలికకు అసభ్యకరమైన వీడియో లు చూపించి నరేష్ లొంగదీసుకున్నాడని మనీష్ కుమార్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 5 వ తేదీ రాత్రి బాలికను తన రూం కి రమ్మని నరేష్ కోరాడు. బాలిక నరేష్ రూమ్ లో ఉన్న సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ వెదకడం చూశారు. దీంతో నరేష్ ఆ బాలికను తన రూమ్ నుంచి టెర్రస్ మీదకు వెళ్ళమని ఫోర్స్ చేశాడు. బాలిక టెర్రస్ మీదకు వెళ్లగా.. అక్కడ బాలిక ఎదురుగా ఉన్న ఆ[అపార్ట్మెంట్ టెర్రస్ తన తన తండ్రిని చూసింది. దీంతో బాలిక బయపడి.. అక్కడ నుంచి దూకేసిందని సీ పీ మనీష్ కుమార్ చెప్పారు.
Also Read: Vizag Girl Death: వైజాగ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక …