Visakhapatnam: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) వైద్యులు ఓ అరుదైన చికిత్సను నిర్వహించారు. 13 ఏళ్లు బాలికకు కడుపులో నుండి తల వె౦ట్రుకలను (ట్రైకో బెజార్) తొలగించారు. దాదాపు 300 గ్రాములు ఉన్న ట్రైకో బెజార్ తొలగించి చిన్నారికి విముక్తి కలిగించారు.
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరో అరుదైన చికిత్సకు వేదిక అయింది. గత కొన్ని నెలలు గా విమ్స్ ఆస్పత్రిలో అనేక అత్యాధునిక అరుదైన చికిత్సలు చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణదాతగా నిలుస్తుంది. తాజాగా రాజమండ్రికి చెందిన ఒక బాలిక తల్లిదండ్రులు వారి 13 ఏళ్ల కుమార్తె గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతుంది. అనేక ఆస్పత్రిలకు బాలికను తీసుకొని వెళ్లినా రోగాన్ని కనిపెట్టడం లేదు.. దీంతో సరైన వైద్యం అందించడం జరగలేదు. విమ్స్ హాస్పటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అరుదైన వ్యాధులకు చికిత్సలు చేస్తారని తెలుసుకున్న బాధిత బాలిక తల్లిదండ్రులు విమ్స్ లో వైద్యులను సంప్రదించగా వారు రోగాన్ని గుర్తించి అరుదైన చికిత్స అందించారు. బాలికకు కడుపు నొప్పి నుంచి విముక్తి కలిగించారు.అనేక ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బాలిక తల్లిదండ్రులకు ఎక్కడ తమ కుమార్తె కడుపు నొప్పికి గల కారణం తెలియలేదు. చివరగా విమ్స్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా.. వైద్యులు బాలికకు ఎండోస్కోపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఎంతో అరుదైన ట్రైకోబెజార్ ( వెంట్రుకలతో కూడుకొని ఉన్న పదార్థాలు) తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఇటువంటి వ్యాధులను గుర్తించటం చాలా కష్టమని అని వైద్యులు తెలిపారు. గత 50 సంవత్సరాల్లో 68 మందిలో ఈ మాత్రమే ఈ వ్యాధి గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మానసిక పరిస్థితి బాగానే ఉందని కాని తల వె౦ట్రుకలు తినేయట౦ చిన్నప్పటి నుండి అలవాటైపోయి౦దని చెప్పారు.
లాప్రోస్కోపీ తో వైద్య౦
ట్రైకోబెజార్ తో బాధపడుతున్న వారికి అత్యాధునిక చికిత్సా లాప్రోస్కోపీ. అధిక మొత్తంలో ఉన్న పదార్థాలను వెలికితీయడానికి లాప్రోస్కోపీ ని ఉపయోగిస్తారు. బాలిక పొట్టలో అధిక మొత్తంలో వెంట్రుకలతో కూడుకొని ఉన్న పదార్థాలు ఉండటం వల్ల లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి వాటిని తొలగించారు. లాప్రోస్కోపీ ద్వారా బాలిక పొట్టలో ఉన్న 300 గ్రాముల ట్రైకోబెజార్ ను తొలగించారు. ఇంత మొత్తంలో తొలగించడం చాలా అరుదని వైద్యులు తెలిపారు.
విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునికమైన అరుదైన చికిత్సలు ఉచితంగా చేస్తున్నారు . గత కొన్ని నెలలుగా న్యూరో సర్జరీ, ఈఎన్ టి, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ విభాగాల్లో అరుదైన చికిత్సలు చేయడం జరుగుతుంది. ట్రైకోబెజార్ తో బాధపడుతున్న చిన్నారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అరుదైన చికిత్స చేసిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ స్రవంతి బృందం కడుపులో ఉన్న జుట్టనునతొలగి౦చి౦.
తాము ఎన్నో ఆస్పత్రిలకు తిరిగిన కానీ ఎక్కడ తన కుమార్తె ఎదుర్కొంటున్న సమస్య గురించి తెలుసుకోలేక పోయామన్నారు చిన్నారి తల్లి. కొంతమంది తమ బంధువులు విమ్స్ ఆస్పత్రి గురించి చెప్పగా ఇక్కడ వైద్యులను సంప్రదించండం జరిగిందన్నారు. సమస్యను గుర్తించి ఉచితంగా ఆపరేషన్ చేసి తన కుమార్తె సమస్యను పరిష్కరించారని విమ్స్ ఆస్పత్రికి, వైద్యులకు రుణపడి ఉంటామని ఆమె చెప్పారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..