Andhra Pradesh: వారీ దేవుడో..! ఆ మొబైల్స్ విలువ అక్షరాలా అరకోటి… పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు..

| Edited By: Shaik Madar Saheb

Aug 20, 2023 | 8:29 AM

Andhra Pradesh: పోయిన మొబైల్ ఫోనలలో ఆపిల్ లాంటి విలువైన ఫోన్లతో పాటు.. అన్ని బ్రాండ్ల మొబైల్స్ ఉన్నాయి. దొరికినవాన్ని దొరికినట్టుగా రికవరి చేసి.. మీడియా ముందు పెట్టారు పోలీసులు. ఆ తరువాత బాధితులకు అప్పగించారు. ఒక్కసారిగా తమ మొబైల్స్ ను చుసిన బాదితులు... ఎగిరి గంతేసేలా ఆనందపడ్డారు. పోయిన ఫోన్ పై ఆశలు వదులుకున్న వాళ్ళంతా ప్రాణంగా భావించే మొబైక్స్ కళ్ళముందు కనిపించందంతో పట్టలేనంత ఆనందంలో మునిగిపోయారు.

Andhra Pradesh: వారీ దేవుడో..! ఆ మొబైల్స్ విలువ అక్షరాలా అరకోటి... పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు..
Crime News
Follow us on

విశాఖపట్నం, ఆగస్టు 19: మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ సుస్థిర భాగం అయిపోయింది..! ఎంతలా అంటే ఏమున్నా లేకపోయినా.. మొబైల్ ఫోన్ మాత్రం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటే చాలు అనేలా. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు.. ఒక్కోసారి పడుకున్న తరువాత కూడా మొబైల్ తో అనుబంధం అలా ఉంది మరి. తీపి గుర్తుల ఫోటోలు, అనుబంధల, ఆప్యాయ్యతలు, అవసరల నెంబర్లు, డేటా.. ఇలా ఒకటి కాదు అన్ని అందులోనే..! అంతలా మనిషితో పెనవేసుకు పోయిన మొబైల్ ఫోన్.. చెజారిపోతే..?! ఆమ్మో.. గుండె జారిపోయేంత పనవుతుంది. ఫోన్లు పోయినా, చోరికి గురైనా ఆ ఆందోళన ఆవేదన అంతా ఇంతా కాదు.అటువంటి మొబైల్స్ పోగొట్టుకున్న వారికి శుభవార్త చెప్పారు విశాఖ పోలీసులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అరకోటి విలువైన మొబైల్స్ రికవరీ చేసి సేఫ్ గా అందించ్చారు. అదికూడా కంప్లైంట్ లేకుండా.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా.. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా.. ఇంట్లో కూర్చుని వివరాలు పంపిన వారికి ఫోన్లు వెతికి మరీ అప్పగించ్చారు.

– మొబైల్ ఫోన్లు పోవడం.. చోరికి గురికావడం కామన్. అటువంటి సమయాల్లో దొరికే వరకు వెతికే ప్రయత్నం చేస్తాం.. అవసరమైతే ఫోన్ కోసం ఖర్చు కూడా పెడతాం. ఇష్ట దైవాలకు మొక్కుకుంటాం. ఎవరైనా మొబైల్ తీసుకొచ్చి ఇస్తే.. వారికి బహుమతులు ఇచ్ఛేందుకైనా వెనుకాడం. ఆ సమయంలో ఆ క్షణం హమ్మయ్య అనుకుని దేవుడే ఇలా పంపించ్చాడా అనుకుంటాం. ఇక అన్ని ప్రయత్నాలు చేసినా మొబైల్ ఫోన్ దొరక్కపొతే ఆశలు వదులు కోవడం తప్పా మరే ఇతర మార్గం లేదు. కానీ.. ఏపీ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన పోర్టల్ చాట్ బోట్ తో ఇక కాస్త ఆలస్యమైనా మీ మొబైక్ ఫోన్ పదిలంగా మీ చెంతకు వచ్ఛేస్తోంది.

ఒకేసారి అరకోటి విలువైన ఫోన్లు..

ఇవి కూడా చదవండి

– విశాఖలో కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. ఇందుకోసం ఓ బృందమే ప్రత్యేకంగా పనిచేస్టోంది. క్రైమ్ డీసీపీ నాగన్న నేత్రత్వంలో మరోసారి భారీగా మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈసారి ఏకంగా 230 మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి తీసుకొచ్చ్చారు. వాటివిలువ దాదాపు అరకోటి ఉంటుందని అన్నారు సిపి త్రివిక్రమ్ వర్మ.

రాష్ట్రలు దాటిపోయిన ఫోన్లు..!

– సిపి ఆదేశాలతో సిటీ పోలీస్‌కి చెందిన CCS బృందం టెక్ సెల్ డేటా సహాయంతో అన్ని సాంకేతిక కోణాల్లో విశ్లేషించింది. వివిధ ప్రదేశాలలో వినియోగదారుల నుండి పోగొట్టుకున్న మొబైల్‌లను.. రికవరీ చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఒడెస్సా, తెలంగాణ తో పాటు ఎపిలోని తిరుపతి, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొబైక్స్ వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు.

పట్టలేనంత ఆనందం..

– పోయిన మొబైల్ ఫోనలలో ఆపిల్ లాంటి విలువైన ఫోన్లతో పాటు.. అన్ని బ్రాండ్ల మొబైల్స్ ఉన్నాయి. దొరికినవాన్ని దొరికినట్టుగా రికవరి చేసి.. మీడియా ముందు పెట్టారు పోలీసులు. ఆ తరువాత బాధితులకు అప్పగించారు. ఒక్కసారిగా తమ మొబైల్స్ ను చుసిన బాదితులు… ఎగిరి గంతేసేలా ఆనందపడ్డారు. పోయిన ఫోన్ పై ఆశలు వదులుకున్న వాళ్ళంతా ప్రాణంగా భావించే మొబైక్స్ కళ్ళముందు కనిపించందంతో పట్టలేనంత ఆనందంలో మునిగిపోయారు. పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

ఇప్పటివరకు కోటికి పైగా..

– చాట్ బోట్ ద్వారా విశాఖ సిటీ పోలీసులు మొబైల్స్ రికవరిలో స్పీడు పెంచ్చారు. తాజాగా రికవరీ చేసిన మొబైల్స్ తో పాటు ఇప్పటివరకు విడతల వారీగా 630 వరకు మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వాటి విలువ కోటి కి పైగా ఉంటుందని అంటున్నారు సిసిఎస్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ.

అలా వివరాలు నమోదు చేస్తే చాలు..

– మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేదు.మీరు ఈ క్రింది విధానాన్ని ఫాలో అయితే చాలు..

ఫిర్యాదు చేయడానికి దశలు:

What’s App మొబైల్ నంబర్ (9490617916) కి “హాయ్” అని టైప్ చేయండి.

1) ఫిర్యాదుకు వెంటనే URL లింక్ (https://bit.ly/3gx10Gg) ఉన్న మెసేజ్ వస్తుంది. ఫారమ్‌లోని లింక్‌పై నొక్కడం ద్వారా ఫారమ్‌లో అవసరమైన తప్పనిసరి ఫీల్డ్‌లు పూరించడం ద్వారా వివరాలను పోలీసులు స్వీకరించడం సులభం అవుతుంది. FIR నమోదు చేయకుండా, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే పోగొట్టుకున్న మొబైల్‌లు రికవరీ చేస్తారు.

2) What’s App మొబైల్ నంబర్ (9490617916) QR కోడ్‌ని DP (డిస్ప్లే పిక్చర్) గా కలిగి ఉంది, మీరు Google ఫారమ్‌ను స్కాన్ చేసి పొందవచ్చు, ఇంకా ఫారమ్‌లలో అవసరమైన తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..