Viral Video: అవి పాములు కాదంట.. శ్రీ రామపాదక్షేత్రంలో కనిపించినవి ఏంటో తెలుసా..?
కృష్ణానది తీరంలోని నాగాయలంక గ్రామంలోని శ్రీ రామపాదక్షేత్రం పుష్కర ఘాటు వద్ద అరుదైన ప్రకృతిదృశ్యం ప్రత్యక్షమైంది.. రాత్రివేళల్లో నది నీటిపొరమీద పాము ఆకారాన్ని తలపించే ఈల్ చేపలు గుంపులు గుంపులుగా ఈదుతూ కనిపించడంతో భక్తులు, పర్యాటకులు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

కృష్ణానది తీరంలోని నాగాయలంక గ్రామంలోని శ్రీ రామపాదక్షేత్రం పుష్కర ఘాటు వద్ద అరుదైన ప్రకృతిదృశ్యం ప్రత్యక్షమైంది.. రాత్రివేళల్లో నది నీటిపొరమీద పాము ఆకారాన్ని తలపించే ఈల్ చేపలు గుంపులు గుంపులుగా ఈదుతూ కనిపించడంతో భక్తులు, పర్యాటకులు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఇవి పాములంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది.. అయితే.. మొదట భయం వ్యక్తం చేసిన భక్తులకు.. అక్కడి స్థానిక మత్స్యకారులు భరోసా కల్పించారు.. ఇవి ప్రమాదకరంకావని.. ఎవరికి హాని తలుపెట్టవని చెప్తున్నారు.. సముద్రం వైపు ఏర్పడిన తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున నదిలోకి వచ్చాయని మత్స్యకారులు పర్యాటకులకు, భక్తులకు వివరిస్తున్నారు.
వీడియో చూడండి..
కృష్ణాజిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ప్రాంతాల్లో మత్స్యకారుల కట్లలో ఈల్ చేపలు విరివిగా చిక్కుతున్నాయి.. కొన్నిచోట్ల రోడ్లపై పాకుతూ కనిపించడం స్థానికులను పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంది. ఈ దృశ్యాలను ఫోన్ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పుష్కర ఘాట్ పవిత్ర వాతావరణం రాత్రి వేళల్లో నీటిలో ఈదే చేపల గుంపులు కలగలిసి విభిన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. అయితే నిపుణులు మాత్రం ఇది సహజ ప్రకృతి ప్రవాహం అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
