AP: తనను తాను చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్.. అన్ని చోట్లా ఆ లొల్లే.. విషయం ఏంటంటే..?

|

Jun 21, 2022 | 3:16 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ చెప్పుతో తనను తాను కొట్టుకున్నాడు. పంటల బీమా ఎందుకు రాలేదని రైతులు నిలదీస్తుండటంతో ఆవేదనతో ఇలా చేశాడు.

AP: తనను తాను చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్.. అన్ని చోట్లా ఆ లొల్లే.. విషయం ఏంటంటే..?
Volunteer Slapped Self
Follow us on

Volunteer slapped Himself: గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన ఓ వాలంటీర్.. తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District)లో కదిరి(Kadiri) మండలం రామదాస్‌ నాయక్‌ తండాలో నగేష్ నాయక్‌ గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నారు. తన పరిధిలో 50 మంది రైతులతో ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయించగా.. వీరిలో ఒకరికి మాత్రమే పంటల బీమా వచ్చింది. మిగిలిన వారికి మాత్రం రాలేదు. ఊళ్లో బీమా వర్తించని రైతులు నగేష్‌ను నిలదీశారు. రైతులంతా కలిసి నగేష్‌ను వెంటబెట్టుకుని ఆర్బీకే సెంటర్‌కు వచ్చారు. అక్కడే వ్యవసాయశాఖ అధికారి ఉన్నా సరే రైతులకు ఆన్సర్ చెప్పలేకపోయారు. తన క్లస్టర్ పరిధిలోని రైతులకు బీమా ఇప్పించలేకపోయానంటూ అధికారి ముందే  ఆవేదన వ్యక్తం చేశాడు నగేష్‌. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో… ఈ ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తా.. అంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

పురుగుల మందు తాగిన ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌

ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ హరిబాబు సూసైడ్ అటెంప్ట్ కలకలం రేపుతోంది. పంట పరిహారం అందలేదని కొందరు రైతులు హరిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన హరిబాబు.. మార్టూరు వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన విషయం చెప్పాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును సేవించాడు. గమనించిన వ్యవసాయశాఖ సిబ్బంది.. హరిబాబును చిలకలూరిపేట హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఇటీవల పంట బీమా మొత్తాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. అయితే కొందరు రైతులు పేర్లు అందులో నమోదు చేయలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్స్, RBK సిబ్బంది, సచివాలయాలు, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు పంట పండకపోయినప్పటికీ.. బీమా అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి