విజయవాడ నగరంలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తూ వాహనదారులకు దడపుట్టిస్తున్నారు. స్టంట్లు చేస్తూ భయపెడుతున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలకే పరిమితమైన బైక్ రేసింగ్‌లు…ఇప్పుడు నగరంలోని ప్రధానరహదారులపై నిర్వహిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అంతే కాదు ఇప్పుడు దుర్గగుడి ఫ్లఓవర్‌ను సెంటర్ పాయింట్‌గా చేసుకున్నారు.
తాజాగా విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌లో కొందరు యువకులు బైకులతో స్టంట్లు చేస్తున్నారు. ఆందోళనకు గురి చేస్తున్నారు.. అటుగా వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నారు. రయ్..రయ్ మంటూ దూసుకుపోతూ బైక్ పై నిలబడి పిస్టల్‌తో విన్యాసాలు చేస్తున్నారు. కనీసం పోలీసులకు కూడా చక్కడం లేదు. సీసీ కెమెరాల్లో పట్టుకుందామని అనుకుంటే.. విన్యాసాలు చేసే బైక్‌కు కనీసం నెంబర్ ప్లేట్ కూడా ఉండటం లేదని పోలీసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో లైకుల కోసం వీడియోలు తీసుకుంటున్నారు. వీరి వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వీడియోలతో విజయవాడ పోలీసులకు చాలెంజ్ విసురుతోంది.
సోషల్ మీడియా వీడియోల ఆధారంగానే పలువురిని గుర్తించేపనిలో పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విజయవాడ పోలీస్.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై గస్తీ పెంచారు. గతంలో బైకు రేసింగ్స్ పెరగడంతో.. వారిపై ఫుల్ ఫోకస్ పెట్టి అణచివేశారు పోలీసులు. ఇప్పుడు కొందరు పోకిరీగాళ్లు ఇలా రెచ్చిపోతున్నారు.
ఇవి కూడా చదవండి: Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..