International Flight Services: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు.. ఏయే రోజుల్లో అంటే..

విజయవాడ విమానశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అక్టోబర్ 31 సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వారంలో రెండు రోజులు నేరుగా గన్నవరం విమానశ్రయం నుంచి షార్జాకు విమాన సర్వీసులు నడవనున్నాయని ఎయిర్ పోర్టు..

International Flight Services: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు.. ఏయే రోజుల్లో అంటే..
Air India

Updated on: Oct 31, 2022 | 12:11 PM

విజయవాడ విమానశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అక్టోబర్ 31 సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వారంలో రెండు రోజులు నేరుగా గన్నవరం విమానశ్రయం నుంచి షార్జాకు విమాన సర్వీసులు నడవనున్నాయని ఎయిర్ పోర్టు డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమ, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు షార్జా నుంచి వచ్చే విమానం గన్నవరం చేరుకుంటుందన్నారు. ఈ సేవలను ఎయిరిండియా అందిస్తుందని తెలిపారు. సాయంత్రం 6:30 కి గన్నవరం నుంచి షార్జా కు విమానం బయలుదేరుతుందని తెలిపారు. మొదటి రోజు షార్జా నుంచి రానున్న విమానానికి మచిలీపట్నం ఎంపీ బాలసౌరి స్వాగతం పలకనున్నారు. విమానయాన సంస్థ ఎయిరిండియా 180 సీట్లతో సర్వీస్ ను ప్రారంభిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ వాసులు షార్జా వెళ్లాలంటే విజయవాడ నుంచి నేరుగా విమాన సేవలు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గన్నవరం నుంచి విమాన సేవలు అందుబాటులోకి రావడంతో కేవలం 4 గంటల్లోనే షార్జా చేరుకునే అవకాశం కలగనుంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం షార్జా వెళ్తున్న వేలాది మందికి ఈ విమాన సేవలు ఎంతో ఉపయోగపడతాయని విమానశ్రయ అధికారులు తెలిపారు. విజయవాడ విమానశ్రయం నుంచి నేరుగా షార్జా విమాన సేవలు నడిపేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా అధికారులతో అనేకసార్లు చర్చి్చినట్లు ఎంపీ బాలశౌరి మీడియాకు తెలిపారు. ఆ కృషి ఫలితంగా ఎయిర్ ఇండియా కంపెనీ విజయవాడ నుండి షార్జా కు వారం లో రెండు రోజులు విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం విజయవాడ విమానాశ్రయంలో మొదటిసారిగా వస్తున్న షార్జా విమానానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు, విజయవాడ ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి స్వాగతం పలకుతారు. అలాగే షార్జాకు ప్రయాణీకులకు బోర్డింగ్ పాసులు అందజేయనున్నారు.

టికెట్ల ధరలు..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓ అలోక్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దుబాయ్‌, నార్త్రన్‌ ఎమిరేట్స్‌ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ నుంచి షార్జాకు డైరెక్ట్‌ ఫ్లైట్ ఉపయోగపడుతుందన్నారు. షార్జాతో పాటు మస్కట్‌, కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతుందని తెలిపారు. విజయవాడ – షార్జాకు ఛార్జీలు రూ. 13,669 నుండి ప్రారంభమవుతాయన్నారు. షార్జా నుంచి విజయవాడకు 399 ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ అంటే సుమారు రూ.9000 నుంచి మొదలవుతాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..