విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను సుదూర ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు నిత్యం దర్శించడానికి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజించే దుర్గమ్మకు కొందరు చీరలు సమర్పిస్తూ ఉంటారు. దసరా రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఇప్పటికీ 3 పర్యాయాలు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు..ఇలా ఎందరో ప్రముఖులు వివిధ సందర్భాల్లో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు, చీరలు, సారే సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. సమర్పించిన ఈ చీరలు ఇచ్చిన వారి కోరిక మేరకు దేవస్థానం అధికారులు సారీ కౌంటర్ కి పంపడమో లేక వారికే ఇవ్వడమో చేస్తుంటారు.
కొందరు అమ్మవారికి పట్టు వస్త్రం అలంకరించిన తర్వాత ఎంత రేటు పెట్టి కొన్నారో అంతే రేటు దేవస్థానానికి రిసిప్ట్ రాసి ఆ చీరని పట్టుకెళ్తారు. కొందరు అమ్మకు ఇచ్చిన వస్త్రాలను గుడికే ఇస్తుంటారు. ఇలా సమర్పించిన చీరకు ఎంత రేటైతే దేవస్థానం నిర్ణయిస్తుందో అంతే రేట్ కి ఇంద్రకీలాద్రిపై వస్త్ర ప్రసాదం కౌంటర్ వద్ద నిర్దేశిత రుసుము చెల్లించి భక్తులు చీరలు కొనుక్కుంటారు. ఇది ఎప్పుడూ జరిగే రొటీన్ పద్ధతి..కానీ ఈ మధ్యకాలంలో అంటే జనవరి 25వ తేదీన జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజ చేయించడానికి పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రికి వచ్చినప్పుడు సమర్పించిన పట్టుచీర శారీ కౌంటర్ నిర్మహలకు కాస్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.. పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన పట్టుచీర మాకు కావాలంటే..మాకు కావాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒత్తిడి తేవడం ప్రారంభించారు.. ఈ చీర చూడడానికి అభిమానులు రోజుకి పదుల సంఖ్యలో వస్తున్నారని.. ఎక్కడెక్కడినుండో తమకి ఫోన్లు కూడా చేస్తున్నారని సారీ కౌంటర్ నిర్వహకులు చెప్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేక పవన్ కళ్యాణ్‌కి తిరిగి శారీని గిఫ్ట్‌గా పంపించనున్నారు శారీ కౌంటర్ నిర్వాహకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం