ప్రేమించుకున్నారు.. పారిపోయారు.. కట్‌చేస్తే ట్విస్ట్ మామూలుగా లేదుగా..

| Edited By: Shaik Madar Saheb

Dec 08, 2024 | 2:53 PM

సాధారణంగా ప్రియుడు మోసం చేస్తే.. ప్రియురాలు రోడ్డు ఎక్కడం చూస్తుంటాం.. లేదా ప్రియురాలు మోసం చేస్తే దేవదాసులా మారి, మానసికంగా కుంగిపోయిన ప్రియుడిని చూసుంటాం.. ఇక్కడ అలా కాదు అంతా రివర్స్.. ప్రియురాలి కోసం ప్రియుడు రోడ్డెక్కి నానా హంగామా చేశాడు..

ప్రేమించుకున్నారు.. పారిపోయారు.. కట్‌చేస్తే ట్విస్ట్ మామూలుగా లేదుగా..
Love Incident
Follow us on

సాధారణంగా ప్రియుడు మోసం చేస్తే.. ప్రియురాలు రోడ్డు ఎక్కడం చూస్తుంటాం.. లేదా ప్రియురాలు మోసం చేస్తే దేవదాసులా మారి, మానసికంగా కుంగిపోయిన ప్రియుడిని చూసుంటాం.. ఇక్కడ అలా కాదు అంతా రివర్స్.. ప్రియురాలి కోసం ప్రియుడు రోడ్డెక్కి నానా హంగామా చేశాడు.. అసలేం జరిగిందంటే.. ప్రేమించుకున్నారు, పారిపోయారు, దొరికిపోయారు.. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.. ఈ క్రమంలో కౌన్సెలింగ్ అనంతరం ప్రియురాలు తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీంతో ప్రియుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయే కావాలంటూ రోడ్ ఎక్కాడు. గుండెలవిసేలా రోదించాడు.. ప్రియుడి తీరుతో కుటుంబసభ్యులు సైతం ఆవేదనకు గురయ్యారు.. ఆ యువకుడికి మద్దతుగా కుటుంబ సభ్యులు సైతం ఆందోళనకు దిగారు. దాంతో ఓ ప్రియురాలి కోసం ప్రియుడు, అతని కుటుంబం చేసిన హడావిడి చివరకు ఉద్రిక్తతకు దారి తీసింది.

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ ప్రేమ జంట వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన వేమండ విజయ్, కే సీతారాంపురం గ్రామానికి యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి బీ.ఫార్మసీ చదువుతుండగా.. అబ్బాయి ఇంటర్ తో ఆగిపోయి పెయింటింగ్ పని చేసుకుంటున్నాడు. ఇంటర్ చదివే రోజుల్లో ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు.

అయితే.. ఆర్థిక, ఉద్యోగ కారణాల రీత్యా తల్లి తండ్రులు ఒప్పుకోరని ఈ నెల నాలుగో తేదీన ఇంటి నుంచి ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. దాంతో యువతి తల్లిదండ్రులు హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మిస్సింగ్ కేస్ నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. వీరి ఆచూకీ మచిలీపట్నంలో ఉన్నట్లు గుర్తించాకగ.. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరూ మేజర్లు కావడంతో ఆ ప్రేమజంట తో పాటు వారి తల్లిదండ్రులకు సైతం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్ లో యువతి అంగీకారంతో పది రోజుల తర్వాత మాట్లాడుకుందాం.. అని ఆమె తల్లితండ్రులతో వెళ్లిపోయింది. దాంతో కంగుతిన్న ప్రేమికుడు కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాడు. యువతిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళన దిగాడు. కానీ అమ్మాయి మాత్రం రాను అని తెగేసి చెప్పడంతో ఆఖరికి పోలీసులే సర్ది చెప్పి అతన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..