Fact Check: ఏపీలోని రామాలయంలో క్రైస్తవ కూటమి ప్రార్థనలు..! ఇది నిజమా..? కల్పితమా..?

|

Apr 01, 2022 | 9:47 PM

రామాలయం ముందు చర్చి ప్రార్థనలు. బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారంటూ హిందూ సంఘాల ఆరోపణలు. ఏపీలో సీఎంనే టార్గెట్‌ చేశాయి ప్రతిపక్షాలు. ఇంతకీ తూర్పుగోదావరి జిల్లాలో ఏం జరుగుతోంది?...

Fact Check: ఏపీలోని రామాలయంలో క్రైస్తవ కూటమి ప్రార్థనలు..! ఇది నిజమా..? కల్పితమా..?
Ramalayam
Follow us on

East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలోని కె.గంగవరం గ్రామంలో రామాలయం వద్ద అన్యమత ప్రార్థనలు జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్(Video Viral) అయ్యాయి. ఈ వీడియోలో రామాలయం ముందు క్రైస్తవ మత ప్రార్థనలు జరుగుతుండగా స్థానిక వ్యక్తి అడ్డుకున్నారు. రామాలయం ముందు ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రామాలయానికి(Lord Rama Temple) ఆనుకుని ఉన్న ఇంటి వద్ద ప్రార్థనలు చేస్తున్నామని, ఆలయం వద్ద కాదని వారు చెప్పడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ ధియోధర్ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన చర్చనీయాంశం మారింది. రంగంలోకి దిగిన పోలీసులు వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంగవరం గ్రామంలో కాదా మంగాయమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. అదే రోడ్డుకు ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఈ విషయంలో స్థానిక హిందువులకు, క్రైస్తవులకు ఎటువంటి అభ్యంతరం లేదు.

ఇటీవల మంగాయమ్మకు, కాకినాడలో ఉంటున్న ఆమె పెద్ద కుమారుడైన కాదా శ్రీనివాస్ తో ఆర్ధిక వివాదాలు తలెత్తాయి. తన తల్లి ప్రార్థనల పేరుతో డబ్బు వృధా చేస్తోందని ఘర్షణ పడ్డాడు. ఈ విషయంలో మంగాయమ్మ, మరికొందరు 100 కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్ది చెప్పారు. ఈ విషయంపై శ్రీనివాస్ కు వరసకు సోదరుడైన వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారనే అనుమానం పెంచుకున్నారు. ఈ నెపంతో “రామాలయంలో ప్రార్ధనలు ఏ విధంగా పెడతారు” అని ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు నమ్మవద్దని కోరారు.

ఈ ఘటనపై ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవదర్‌ ట్వీట్స్‌ చేశారు. ఇది జగన్‌ సీక్రెట్‌ అజెండా అని ఆరోపించారు. ముఖ్యమంత్రే, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం, రామచంద్రాపురం ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుడి విగ్రహాలను అవమానపరిచేలా పాస్టర్‌ క్రీస్తుబోధనలు చేయడం దారుణమన్నారు. కూటమి జరిగిందని రామాలయం కమిటీ పెద్ద కర్రీ చిట్టిబాబు స్పష్టం చేశారు. మొత్తానికి సునిశిత అంశాన్ని ఫ్యాక్ట్‌ చెక్‌తో..ఏపీ సర్కార్‌ చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించింది. వాస్తవం ఇదంటూ..ఎవరూ ఉద్రేక పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఐతే బీజేపీ నేతలతోపాటు రామాలయం కమిటీ నిర్వాహకులు కూటమి జరిగిందని చెప్పారు.

Also Read

BJP in Rajya Sabha: రాజ్యసభలో చరిత్ర సృష్టించిన బీజేపీ… తొలిసారిగా 100కి చేరిన సభ్యుల సంఖ్య

Srilanka Crisis: శ్రీలంకలో రాజుకున్న రావణకాష్టం..ఆదుకోవాలని ఐఎంఎఫ్‌తో పాటు భారత్‌కు రాజపక్సే విజ్ఞప్తి

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!