ఆటోకి అతికించిన సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి.. సాయి మహిమే అంటున్న భక్తులు

అనంతపుం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో అద్భుత ఘటన ఆవిష్కృతమైనట్లు సత్యసాయి బాబా భక్తులు చెబుతున్నారు.

ఆటోకి అతికించిన సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి.. సాయి మహిమే అంటున్న భక్తులు

Updated on: Jan 12, 2021 | 8:42 PM

అనంతపుం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో అద్భుత ఘటన ఆవిష్కృతమైనట్లు సత్యసాయి బాబా భక్తులు చెబుతున్నారు. కుమ్మర పేటలో ఆంజనేయులు అనే ఆటో డ్రైవర్‌కి చెందిన 39వ నంబర్ ఆటో‌ వెనుక అతికించిన సత్యసాయి ఫ్లెక్సీ చిత్రపటం నుంచి విభూతి రాలుతుందని వివరిస్తున్నారు.

ఉదయాన్నే ఆటో డ్రైవర్‌ తన ఆటోనీ తీసుకుని పట్టణంలోకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా, ఆటోకి వెనకాల అతికించిన చిత్ర పటం నుంచి విభూతి రాలడాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్‌కి చెప్పారు. విభూతి రాలడాన్ని గమనించిన డ్రైవర్‌ ఆంజనేయులుతో పాటు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు.  ఆటో నుంచి విభూతి రాలుతున్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆటో వద్దకు చేరుకుని పూజలు చేస్తున్నారు. రాలుతున్న విభూతిని తమ వెంట ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. ఇదంతా బాబా మహిమగా భక్తులు భావిస్తున్నారు.

Also Read :

Bowenpally Kidnap Case: కిడ్నాప్ కేసులో మరో సంచలన ట్విస్ట్.. జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు

Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు