Vangaveeti Radha: ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ఎలాంటి భద్రత అక్కర్లేదు.. గన్‌మెన్‌ను వెనక్కు పంపిన వంగవీటి రాధా..

|

Dec 28, 2021 | 9:41 PM

భద్రత కల్పించేందుకు వచ్చిన గన్‌మెన్లను వంగవీటి రాధా సున్నితంగా తిరస్కరించారు. తనకు ఎలాంటి భద్రత అక్కర్లేదని చెప్పారు. భద్రత కల్పించేందుకు వచ్చిన..

Vangaveeti Radha: ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ఎలాంటి భద్రత అక్కర్లేదు.. గన్‌మెన్‌ను వెనక్కు పంపిన వంగవీటి రాధా..
Vangaveeti Radha
Follow us on

 Vangaveeti Radha Rejected Gunman: తనకు గన్‌మెన్లు వద్దన్నమాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. తనను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెనుదుమారం రేపాయి. రాధాకు నిజంగా ప్రాణహాని ఉండొచ్చని భావించిన ప్రభుత్వం ఆయన భద్రత కోసం నలుగురు గన్‌మెన్లను నియమించింది. భద్రత కల్పించేందుకు వచ్చిన గన్‌మెన్లను వంగవీటి రాధా సున్నితంగా తిరస్కరించారు. తనకు ఎలాంటి భద్రత అక్కర్లేదని చెప్పారు. భద్రత కల్పించేందుకు వచ్చిన గన్‌మెన్‌ను వెనక్కి పోవాలని సూచించారు. రాధా సూచనల మేరకు గన్‌మెన్‌ వెనక్కి తిరిగి వెళ్లాడు.

వంగవీటి రాధా ఒప్పుకుని ఉంటే తానొక్కడినే కాదని, మరో ముగ్గురు గన్‌మెన్లు వచ్చేవారని రాధా రక్షణ కోసం వచ్చిన గన్‌మెన్‌ తెలిపారు. రాధా తనకు గన్‌మెన్ల అవసరం లేదని తిరిగి వెళ్లిపోవావలని సూచించడంతో చేసేదేమీలేక వెళ్లినట్లు గన్‌మెన్‌ వెల్లడించారు. రాధా తనను తిరిగి వెళ్లిపొమ్మన్న విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని గన్‌మెన్‌ వెల్లడించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అందుకే గన్‌ మెన్లు వద్దన్నా అని వివరించారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్‌ చేసి అడిగారని చెప్పారు. నన్నేదో చేద్దామనుకుంటున్నారు. రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా. ఎక్కడికీ పారిపోను. వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుంది? అలాంటి వ్యక్తుల్ని మీరందరూ దూరం పెట్టాలి. తన అనుచరుల సమక్షంలో … మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు …వంగవీటి రాధా చేసిన సెన్సేషనల్‌ కామెంట్స్ ఇవి.

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం