Vande Bharat: విశాఖ నుంచి బయలుదేరాల్సిన వందే భారత్ రైలు రీ షెడ్యూల్.. ఇవిగో డీటేల్స్

|

Apr 28, 2023 | 7:12 PM

వందే భారత్‌లో శనివారం నాడు వైజాగ్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్‌లో ప్రయాణించాలనుకునేవారికి అలెర్ట్. రైలు రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి రావాల్సిన రైలు లేటుగా నడవడమే ఇందుకు కారణమన్నారు.

Vande Bharat: విశాఖ నుంచి బయలుదేరాల్సిన వందే భారత్ రైలు రీ షెడ్యూల్.. ఇవిగో డీటేల్స్
Vande Bharat Rail
Follow us on

వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వందే భాతర్ ఎక్స్‌ప్రెస్ శనివారం(29 ఏప్రిల్) రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. వైజాగ్ నుంచి  వందే భారత్‌ ట్రైన్ డైలీ షెడ్యూల్ ప్రకారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ శనివారం మాత్రం ఉదయం 9.45 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.  సికింద్రాబాద్‌ నుంచి రావాల్సిన ట్రైన్ లేటుగా నడుస్తుండటమే రీ షెడ్యూల్‌కు కారణమని వివరించారు.

వైజాగ్ నుంచి  సికింద్రాబాద్‌ వెళ్లే వందే భారత్‌ ట్రైన్ నంబర్ 20833 ట్రైన్ షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 5.45 గంటలకు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి.. 7.55కు రాజమండ్రి, 10గంటలకు విజయవాడ, 11 గంటలకు ఖమ్మం, 12.05కు వరంగల్‌, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్‌ రావాల్సి ఉంది. వైజాగ్ నుంచి 4 గంటలు లేటుగా బయలుదేరనుండటంతో శనివారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. ప్రయాణికులు ఈ షెడ్యూల్‌ను అనుసరించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ట్రైన్‌ను శుభ్రంగా ఉంచాలని అధికారుల అభ్యర్థన

భారత రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న వందే భారత్ రైలు పరిశుభ్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రైలుని మురికి కూపంలా మారుస్తున్నారంటూ రైల్వే అధికారులు వాపోతున్నారు. వేలాది మంది ప్రయాణించే వందేభారత్‌ కోచ్‌లలో…తిని, తాగి… కోచ్ లలోనే కప్పులు, ప్లేట్స్ పడేసి అత్యంత అపరిశుభ్రంగా తయారుచేస్తుండడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన రైలు…మన గౌరవానికి సంబంధించిన విషయం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వ్యక్తి గతంగా ఎలా శుభ్రంగా ఉంటామో అలానే ట్రైన్ ను కూడా శుభ్రంగా ఉంచాలంటూ వేడుకుంటున్నారు. ఉదయం విశాఖ నుంచి శుభ్రంగా వెళ్ళే ట్రైన్ రాత్రికి వచ్చేటప్పటికి చెత్త చెత్తగా తయారుచేస్తున్నారని… ప్రయాణికులు ఒక్కసారి ఆలోచించాలని రైల్వే ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.