Uyyalawada Narasimha Reddy: కేంద్రం కీలక నిర్ణయం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామానికి ప్రత్యేక గుర్తింపు..

|

Oct 11, 2021 | 8:35 AM

Uyyalawada Narasimha Reddy: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామానికి కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చింది.

Uyyalawada Narasimha Reddy: కేంద్రం కీలక నిర్ణయం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామానికి ప్రత్యేక గుర్తింపు..
Buggana
Follow us on

Uyyalawada Narasimha Reddy: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామానికి కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చింది. ఫలితంగా నరసింహా రెడ్డి స్వగ్రామం ఉయ్యాలవాడ స్మార్ట్ విలేజ్‌గా మారింది. ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా గ్రామంలో వైఫై సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ వైఫై సేవలను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే గంగుల నాని, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలకు గుర్తింపుగా ఆయన స్వగ్రామంలో కేంద్ర ప్రభుత్వం పీఎం వాణీ సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైఫై సేవలను స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also read:

Pan Card: పాన్‌కార్డు కనిపించడం లేదా..! అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Petrol Diesel Price: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక మన నగరంలో మాత్రం..

Megastar Chiranjeevi: అలాంటి వారిని దూరం పెట్టాలి.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా ?.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..