ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్కూల్స్ విలీనం రాజకీయ వేడి పెంచుతోంది. ఈ అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని యూటీఎఫ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. స్కూల్స్ మర్జింగ్‌ను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ (UTF) ఎమ్మెల్సీలు చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో కొనసాగింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి యాత్రను మొదలుపెట్టిన యూటీఎఫ్ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరికి (Nagari) చేరుకున్నారు. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్‌తో మాట్లాడారు. మండలంలోని వినాయకపురం ప్రాథమిక పాఠశాలలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారని యూటీఎఫ్ లీడర్స్ చెబుతున్నారు. తమ పిల్లల్ని తమ ఊర్లోనే చదివించుకుంటామని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారని వెల్లడించారు. తమ గ్రామంలోనే స్కూల్ లేకపోతే పిల్లల్ని బడికి పంపమని తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారని వివరించారు. మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలోనే 18 స్కూల్స్ విలీనంతో మూతపడబోతున్నాయని యూటీఎఫ్ ఎమ్మెల్సీలు అన్నారు.
నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోన్న ప్రాథమిక పాఠశాలలను ఆయా గ్రామాల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్స్ గోడు విని, స్కూల్స్ మెర్జింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయని స్కూల్స్ విలీనాన్ని ఏపీలో ఇంప్లిమెంట్ చేయడం బాధాకరమన్నారు. నాడు నేడు కింద పాఠశాలల డెవలప్‌మెంట్‌కు లక్షల కోట్లు ఖర్చుచేసి ఇప్పుడు విలీనం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు, పేరెంట్స్ బాధలను అర్ధంచేసుకుని విలీన ప్రక్రియను నిలిపివేయాని డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..