వర్సిటీల్లో వింత చేష్టలు…శోభనానికి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లు..! – Watch Video

|

Aug 22, 2021 | 8:15 PM

తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో తరచూ చోటుచేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలు, విద్యార్ధుల మధ్య ర్యాగింగ్‌, ఘర్షణలు, దాడులు వివాదాస్పదం అవుతున్నాయి.

వర్సిటీల్లో వింత చేష్టలు...శోభనానికి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లు..! - Watch Video
Representative Image
Follow us on

తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో తరచూ చోటుచేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలు, విద్యార్ధుల మధ్య ర్యాగింగ్‌, ఘర్షణలు, దాడులు వివాదాస్పదం అవుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు ఉండనే ఉన్నాయి. అటు ఖాళీగా వైస్‌ ఛాన్సలర్‌ పోస్టులు, అవకతవకల పాలన తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా… కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో కొత్త జంటకు శోభనం ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రొఫెసర్‌ స్వర్ణకుమారి కుమార్తె హనీమూన్‌కు యూనివర్సిటీ గెస్ట్‌హౌస్ వేదికయ్యింది. ప్రొఫెసర్‌ పేరుతో మూడు గదులు బుక్‌ కాగా.. 201వ నంబరు రూమ్‌లో మూడు రోజులుగా కొత్త జంట శోభనం నిర్వహించారు. సరస్వతీ నిలయంలో ఇదేం పాడుపనంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.  యూనివర్సిటీ యాజమాన్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తుండటంతో వీసీ రామలింగరాజు విచారణకు ఆదేశించారు. మరిన్ని వివాదాలు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఈ వివరాలను ఈ వీడియోలో వీక్షించండి.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న యూనివర్సిటీలు..Watch Video

Also Read..

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న కోలుకున్న వారి సంఖ్య

రాక్షస రాజ్యం నుంచి భారత్ చేరుకున్నాం తమ్ముడూ.. ముద్దులతో ముంచేసిన ఆనందంలో చిన్నారి..

PV Sindhu Photoshoot: స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు లేటెస్ట్ ఫోటోషూట్