Andhra Pradesh: ప్రధాని మోదీ సభకు చంద్రబాబుకు ఆహ్వానం.. లేఖ పంపిన కేంద్ర మంత్రి..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కీలక ఆహ్వానం అందింది.

Andhra Pradesh: ప్రధాని మోదీ సభకు చంద్రబాబుకు ఆహ్వానం.. లేఖ పంపిన కేంద్ర మంత్రి..
Babu

Updated on: Jun 30, 2022 | 1:29 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కీలక ఆహ్వానం అందింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును సర్మించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన కిషన్ రెడ్డి.. భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి టీడీపీ నుంచి ప్రతినిధిని పంపాలని పేర్కొన్నారు. ఆహ్వాన లేఖ రాయడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాగా, అల్లూరి జయంతి వేడుకలపై భీమవరంలో జరిగే ప్రధాని మోదీ కార్యక్రమంలో చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ తరుపున ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.