Andhra Pradesh: ఆరోగ్య శ్రీ కార్డుపై జగన్ ఫొటో సరే.. ప్రధాని ఫొటో ఏమైంది?.. అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి

|

Jun 11, 2022 | 10:58 AM

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్(Union Minister Bharati Pawar) పైర్ అయ్యారు. రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ విజయవాడ ఆస్పత్రిని పరిశీలించారు. ఆరోగ్య శ్రీ...

Andhra Pradesh: ఆరోగ్య శ్రీ కార్డుపై జగన్ ఫొటో సరే.. ప్రధాని ఫొటో ఏమైంది?.. అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి
Union Minister Bharati Pawar
Follow us on

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్(Union Minister Bharati Pawar) పైర్ అయ్యారు. రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ విజయవాడ ఆస్పత్రిని పరిశీలించారు. ఆరోగ్య శ్రీ పథకంపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పీఎంజేఏవై నిధులతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై దివంగత సీఎం వైఎస్‌, ప్రస్తుత సీఎం జగన్‌ల(CM Jagan) ఫోటోలు మాత్రమే ముద్రించి.. ప్రధాని ఫొటోను ముద్రించకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోగ్యమిత్ర హెల్ప్‌డెస్క్‌ సిబ్బందితో మాట్లాడిన కేంద్ర మంత్రి.. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్‌పై వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ల ఫొటోలు మాత్రమే ఉండటాన్ని చూసి, ప్రధాని ఫొటోను ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందన్న సంగతి తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె. నివాస్‌.. ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును కేంద్ర మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తూ దానిపై ప్రధాని ఫొటో ఎందుకు లేదని నిలదీశారు.

అర్హులైన వారికి ఆరోగ్య కార్డులు జారీ చేసే ప్రక్రియపై కేంద్రమంత్రి ఆస్పత్రి సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్‌ భారత్‌, ఈ-సంజీవని టెలీ మెడిసిన్‌ సర్వీసెస్‌, విజయవాడ హబ్‌ను మంత్రి పరిశీలించారు. ల్యాబ్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న జూనియర్‌ డాక్టర్లతో కాసేపు ముచ్చటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి