AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో దారుణం.. వివాహితపై యాసిడ్‌ దాడి.. రాత్రి స్కూటీపై వెళుతుండగా..

Eluru News: ఏలూరు విద్యానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది.

Andhra Pradesh: ఏపీలో దారుణం.. వివాహితపై యాసిడ్‌ దాడి.. రాత్రి స్కూటీపై వెళుతుండగా..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jun 14, 2023 | 7:24 AM

Share

Eluru News: ఏలూరు విద్యానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. అయితే, ఆమె కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విద్యానగర్‌ మానిస్ట్రీ దగ్గరలో నివాసం ఉంటున్న యడ్ల ప్రాంచిక (35) భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాంచిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారితోనే ఉంటుంది. రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్‌ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. అయితే, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ప్రాంచికాపై యాసిడ్‌ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది.

అనంతరం, పరిస్థితి తీవ్రంగా మారగా.. ఆమె చెల్లి యడ్ల సౌజన్య, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్‌పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె రెండు కళ్లు చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నింది తులను పట్టుకుంటామన్నారు. డీఎస్పీ, నగరంలోని సీఐలు, ఎస్‌ఐలు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. అనంతరం బాధితురాలి ఇంటి సమీపంలోని సంఘటనా స్థలిని పరిశీలించారు. ఫ్రాంచిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్