చంద్రబాబుకు సానుకూల ఫలితాలు.. లోకేశ్ సక్సెస్‌ అవుతారు.. టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం

|

Mar 22, 2023 | 3:34 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక బుధవారం (మార్చి 22) మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు

చంద్రబాబుకు సానుకూల ఫలితాలు.. లోకేశ్ సక్సెస్‌ అవుతారు.. టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
Chandrababu Naidu
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక బుధవారం (మార్చి 22) మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. రాష్ట్రం, దేశంలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి ఆదరణ ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయన్నారు. ‘ అక్టోబర్ 30 తర్వాత రాజకీయాలు వేగంగా మారతాయి. పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం ఎక్కువగా ఉంటుంది. కేసులు ఇబ్బందులకు గురిచేసినా.. అన్నింటినీ ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షం ముందుకెళ్తుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతుంది. చంద్రబాబు లక్ష్య సాధన సత్ఫలితాలనిస్తుంది. ప్రజాదరణ, జననీరాజనం ఉంటుంది. లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు అన్నీ విజయవంతం అవుతాయి. టీడీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది’ అని వేద పండితులు పేర్కొన్నారు. అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబుకు సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి.. టీడీపీకి ఓట్లేశారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..