Andhra pradesh: పుష్కరిణి అభివృద్ధి కోసం తవ్వుతుండగా అద్భుతం దృశ్యం.. తరలి వస్తున్న భక్త జనం.

|

Feb 09, 2023 | 3:17 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఆలయ పుష్కరిణి అభివృద్ధిలో భాగంగా పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది...

Andhra pradesh: పుష్కరిణి అభివృద్ధి కోసం తవ్వుతుండగా అద్భుతం దృశ్యం.. తరలి వస్తున్న భక్త జనం.
Andhra Pradesh Temple
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఆలయ పుష్కరిణి అభివృద్ధిలో భాగంగా పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉన్న పుష్కరిణి అభివృద్ధి చేసే క్రమంలో గత రెండు నెలల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. ఈ క్రమంలోనే నీటి మట్టం తగ్గడంతో బుధవారం పుష్కరణిలో రెండు శివలింగాలు బయట పడ్డాయి. ఏళ్ల క్రితం నాటి శివ లింగాలు దర్శనమివ్వడంతోనే విషయం తెలుసుకున్న ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగాలను పాలతో అభిషేకం చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తును ఆలయానికి తరలి వస్తున్నారు. బయటపడ్డ శివలింగాలను దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే కొనేరులో మరో 25 అడుగుల నీరు ఉంది. అయితే ఈ మొత్తం నీటిని బయటకు తోడే లోపు మరిన్ని శివలింగాలు బయట పడే అవకాశం ఉందని అర్చకులు అభిప్రాయపడుతున్నారు. నీటిని మొత్తం బయటకు తీసిన తర్వాత భక్తులు పుష్కరణిలోకి దిగి శివలింగాలను పూజించుకునేలా ఏర్పాట్లు చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇక ఈ శివలింగాలు ఏ కాలానికి చెందినవో తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..