గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు.. స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!

నల్లమల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అటవీ జంతువులను చంపి వాటి మాంసం, కొమ్ములు, గోర్లు, దంతాలు, చర్మం వంటివి సరఫరా చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి పులులు బయటకొస్తున్న నేపధ్యంలో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ క్రమంలోనే విక్రయించడానికి సిద్దంగా ఉన్న పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు..  స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!
Tiger Fingers, Teeths Smuggling

Edited By:

Updated on: Jan 27, 2026 | 9:48 AM

నల్లమల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అటవీ జంతువులను చంపి వాటి మాంసం, కొమ్ములు, గోర్లు, దంతాలు, చర్మం వంటివి సరఫరా చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి పులులు బయటకొస్తున్న నేపధ్యంలో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ క్రమంలోనే విక్రయించడానికి సిద్దంగా ఉన్న పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల జిల్లాలోని నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులుల హంతక ముఠా సంచరిస్తోంది. అంతర్జాతీయ వేటగాళ్లు రంగంలోకి దిగినట్లుగా అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో పులిగోర్లను సేకరించి విక్రయిస్తున్న ముఠాలను అధికారులు అరెస్టు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పులి గోర్లను విక్రయిస్తూ అటవీశాఖ అధికారులకు దొరికిపోయారు. పక్క ప్రణాళికతో అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జనవరి 23వ తేదీన కొత్తపల్లి మండలంలోని గుమ్మడాపురం కి చెందిన మురళి వద్ద పులిగోర్లు ఉన్నాయన్న సమాచారం అటవీశాఖ అధికారులకు చేరింది. అటవీ శాఖ సిబ్బంది మారువేషంలో రహస్యంగా వెళ్లి, పులి గోర్ల కోసం బేరం ఆడారు. ఒక పులిగోరు ఖరీదు పదివేల రూపాయల వరకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోని పూర్తి ఆధారాలతో మురళిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత అతని విచారించగా ఎర్రమఠంకు చెందిన విష్ణు అనే వ్యక్తి వద్ద నుండి మరిన్ని పులిగోర్లు, దంతాలు ఉన్నట్లు తేలడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని విచారించగా 2019లో కొలనుభారతి పరిసర ప్రాంతాలలో గొర్రెలను మేపేందుకు వెళ్లగా మరణించిన పులి కళేబరం నుంచి గోర్లు, దంతాలు సేకరించినట్లు తెలిపారు. అటవీ శాఖ చట్టాల ప్రకారం పులులకు సంబంధించిన గోర్లు దంతాలు తీసుకోవడం అమ్మడం కొనడం నిషేధం. ఇది తెలుసుకున్న నిందితులు సేకరించిన పులిగోర్లు, దంతాలను ఎక్కడ ఎలా విక్రయించుకోవాలో తెలియక అలాగే దాచుకున్నారు. దాచుకున్న విషయం కాస్త గుట్టు రట్టు కావడంతో అటవీ శాఖ అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. ఇదిలావుంటే, నెల రోజుల క్రితం కూడా పులి గోర్లు విక్రయిస్తున్న కొనుగోలు చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..