Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.100కే కిలో చికెన్! ఎగబడ్డ జనాలు..

|

Nov 25, 2024 | 11:04 AM

చికెన్ ప్రియులకు ఇద్దరు వ్యాపారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. కేవలం రూ.వందకే కిలో చికెన్ విక్రయిస్తున్నట్లు బోర్డు పెట్టారు. అంతే.. ఒక్కసారిగా జనాలు ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయారు. దెబ్బకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది..

Chicken Price: చికెన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రూ.100కే కిలో చికెన్! ఎగబడ్డ జనాలు..
Chicken Traders
Follow us on

కర్నూలు, నవంబర్‌ 25: ఆదివారం వచ్చిదంటే మాంసం ప్రియులు చికెట్‌ దుకాణాల ఎదుట బారులు తీరుతారు. ధర ఎంతైనాసరే తగ్గేదేలే.. అన్నట్లు డబ్బు చెల్లించి చికెన్‌ కొనుక్కెళ్తారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చాలా చోట్ల చికెన్‌ కిలో రూ.250 వరకు పలుకు తోంది. అయితే ఆ ఊరిలో మాత్రం ఆదివారం కిలో చికెన్ కేవలం రూ.100 లకే విక్రయించారు ఇద్దరు వ్యాపారులు. ఇంకేం.. చికిన్‌ ప్రియులు సదరు షాపుల ఎదుట బారులు తీరి నిలబడ్డారు. దీంతో రోడ్డంతా జనాలతో కిక్కిరిసిపోయింది. దెబ్బకు పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ సెట్ చేయాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన కర్నూలు జిల్లాలో ఆదివారం (నవంబర్ 24) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కర్నూలులోని మద్దూర్ నగర్‌లో రెండు దుకాణాల వద్ద కిలో చికెన్ రూ.100కే అమ్మడంతో జనం బారులు తీరారు. షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ చికెన్ సెంటర్లు ఉన్నాయి. వీటి నిర్వాహకులు ఒకరిపై ఒకరు పోటీపడి మరీ కిలో చికెన్‌ను వంద రూపాయలకే విక్రయించారు. దీంతో కొనుగోలుదారులు ఆ రెండు చికెన్ షాపుల వద్ద కిటకిటలాడిపోయారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటలకుపైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. చికెన్‌ ఆఫర్ పుణ్యమాని వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్‌ పోలీసులు కలగ జేసుకోవడంతో రోడ్లన్నీ సాఫీ అయ్యాయి.

సాధారణంగా కిలో చికెన్‌ ధర రూ.200 నుంచి రూ.250కు పైగా ఉంటుంది. కార్తిక మాసం కావడంతో కొన్ని ప్రాంతాల్తో దాదాపు సగం ధరకే చికెన్‌ విక్రయిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు మంత్రి పదవి వచ్చినందుకు.. ఆయనపై అభిమానంతో షమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు రూ.100కే చికెన్ విక్రయించానని తెలిపాడు. అయితే కార్తీకమాసం కావడంతో చికెన్ కొనుగోలుదారులకు తనవంతుగా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని సుభాన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పడం విశేషం. ఇలా ఈ ఇద్దరు వ్యాపారులు ఇచ్చిన ఆఫర్‌.. స్థానికులకు నిన్న విందు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.