
సాధారణంగా కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది దగ్గరకు వస్తే.. ఇంకేమైనా ఉందా.! దెబ్బకు హడలిపోతారు. ఊరు చివరిన ఉన్న మామిడి తోటలో ఏకంగా రెండు కొండచిలువలు వచ్చాయి. వాటిని చూడగానే అక్కడ పని చేసే సిబ్బంది దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం రేపాయి. సుమారు 13 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువలను పశువులను మేపేందుకు వెళ్లిన గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ శోభనాద్రి నేతృత్వంలోని రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి చాకచక్యంగా రెండు కొండచిలువలను పట్టుకుంది. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇది చదవండి: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’