TTD OSD Dollar Seshadri: శ్రీతిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. కాగా, డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Also… Ravinder Singh: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?