Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌… క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు

తిరుమలలో శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సేవలను మెరుగుపరుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే సేవలను టీటీడీ విస్తృతం చేస్తోంది. ఇప్పటికే అందిస్తున్న సేవలను మెరుగుపర్చడానికి...

Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌... క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు
Ttd Feedback System

Updated on: Jul 21, 2025 | 12:08 PM

తిరుమలలో శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సేవలను మెరుగుపరుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే సేవలను టీటీడీ విస్తృతం చేస్తోంది. ఇప్పటికే అందిస్తున్న సేవలను మెరుగుపర్చడానికి కృషిచేస్తోంది. శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న టీటీడీ ఫీడ్ బ్యాక్ సిస్టంను అమలు చేస్తోంది. ఈ మేరకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటు లోకి తీసుకొచ్చింది.

భక్తుల ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా పరోక్ష పద్ధతులనుపయోగిస్తోంది టీటీడీ. ఇప్పుడందిస్తున్న సేవలకు అదనంగా ఎలాంటి సేవలు ఆశిస్తున్నారో తెలుసుకుంటోంది. ఇందుకు ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా ఈ-సర్వే, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యూవల్ సర్వే లను ప్రారంభించి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటోంది టీటీడీ. ఎలక్ట్రానిక్ సర్వే విధానo ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం తెలుసుకుంటోంది. అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, లగేజ్ కౌంటర్ల పై ఇలా మొత్తం 16 అంశాలపై ప్రశ్నావళిని రూపొందించి ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది. ఏఐ అసిస్టెన్స్ బార్‌ను సైతం అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.

వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం ద్వారా తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు అభిప్రాయం తెలిపే అవకాశం కల్పించింది. భక్తులు ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు వాట్సాప్‌ నెం 9399399399ని ముందుకు తెచ్చింది. ఈ నెంబర్‌పై టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
భక్తులు తమ పేరు, విభాగం ఎంపిక చేసి అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు ఇలా పలు అంశాలను సెలెక్ట్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా అవకాశం కల్పించింది.

మరోవైపు శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ కూడా టీటీడీ చేపట్టింది. సేవకులు నేరుగా భక్తులను కలిసి సేవలందుతున్న తీరు, మెరుగుకోసం చేపట్టాల్సిన చర్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్, టీటీడీ బుకింగ్ పోర్టల్ నుంచి కూడా భక్తుల విలువైన సలహాలు సూచనలు తీసుకొనడానికి అప్లికేషన్ రూపొందించనుంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి సేవలను మెరుగు
పరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.