
కృష్ణాజిల్లా చెవిటికల్లు దగ్గర హైటెన్షన్
ఇంకా నదీ గర్భంలోనే లారీలు
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
క్రేన్స్, జేసీబీలతో సహాయక చర్యలు
లారీలను బయటికి తెచ్చేందుకు ప్రయత్నం
ఇంకా వరద నీటిలోనే 125 లారీలు
పులిచింతల ఔట్ ఫ్లో తాత్కాలికంగా నిలిపివేత
బండ రాళ్లతో నది మధ్యలో దారి ఏర్పాటు
ర్యాంప్ పై తేలిన రాళ్లు
కృష్ణాజిల్లా చెవిటికల్లు ఇసుక ర్యాంపు దగ్గర ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. కృష్ణా నది మధ్యలో ఇరుక్కుపోయిన లారీలను బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పులిచింతల ఔట్ ఫ్లోను తాత్కాలికంగా ఆపడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్లు, జేసీబీల సహాయంతో లారీలను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, సమయం గడిచేకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. జేసీబీల సహాయంతో ఒక్కో వాహనాన్ని గట్టు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని వాహనాలను బయటికి తీసుకొచ్చారు.
ఇప్పటివరకు 50 లారీలను బయటికి తీసుకొచ్చారు. పులిచింతల దగ్గర ఔట్ ఫ్లోను తాత్కాలికంగా ఆపినప్పటికీ వరద ప్రవాహం భారీగానే కొనసాగుతోంది. ఇంకా, ఐదు లక్షల క్యూసెక్కుల నీళ్లు దిగువకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో, లారీలను బయటికి తీసుకొచ్చేందుకు నది మధ్యలో బండ రాళ్లతో దారి ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వరద ప్రవాహం కొనసాగుతుండటంతో లారీలను బయటికి తీసుకురావడం కష్టతరంగా మారింది. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నా… ఇంకా, 125 లారీలు నదీ గర్భంలోనే ఉన్నాయి.
Also Read: Suryapet: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్