
సమాజంలో పేద వర్గాల అభ్యున్నతిలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. శిక్షణ పొందుతున్న అఖిల భారత సర్వీసు అధికారులతో గవర్నర్ హరిచందన్ భేటీ అయ్యారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌర సేవకు అవకాశం పొందినట్లు భావించాలన్నారు. ప్రజా సమస్యలను సానుకూల దృక్పధంతో పరిష్కరించాలని గవర్నర్ సూచించారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్ లకు ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని వివిధ విభాగాలలో నియమించింది.