Cyclone Michaung: మిచౌంగ్ ఎఫెక్ట్.. ఏపీలోని ఆ మార్కెట్‌లో టమోటా ధరలు పైపైకి.!

| Edited By: Ravi Kiran

Dec 05, 2023 | 12:25 PM

తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం అవుతుంటే.. కర్నూలు జిల్లా ఆస్పరి మార్కెట్‌లో మాత్రం అనూహ్యంగా టమోటా ధరలు పెరిగాయి. ఆస్పరి మార్కెట్ నుంచి టమోటా ఎగుమతులు పెరగటమే ఇందుకు నిదర్శనం. తద్వారా కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ఉన్న టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది.

Cyclone Michaung: మిచౌంగ్ ఎఫెక్ట్.. ఏపీలోని ఆ మార్కెట్‌లో టమోటా ధరలు పైపైకి.!
Follow us on

తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం అవుతుంటే.. కర్నూలు జిల్లా ఆస్పరి మార్కెట్‌లో మాత్రం అనూహ్యంగా టమోటా ధరలు పెరిగాయి. ఆస్పరి మార్కెట్ నుంచి టమోటా ఎగుమతులు పెరగటమే ఇందుకు నిదర్శనం. తద్వారా కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ఉన్న టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది. 20 కిలోలు ఉన్న టమోటా బాక్స్ ధర 400 రూపాయలు పలికింది. అంటే కిలో ధర 20 రూపాయలు అన్నమాట. ఇది కేవలం ఆస్పరి టమోటా మార్కెట్‌లో మాత్రమే ఉంది. ఇక ఇలా మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌కు.. ఇక్కడ టమోటా ధరలు పెరగడానికి.. చెన్నైకి ఆస్పరి మార్కెట్‌ నుంచే టమోటా ఎగుమతి కావడమే ఇందుకు కారణం. పత్తికొండ, కర్నూలు, ప్యాపిలి టమోటా మార్కెట్లకు ఆ ధర లేదు. ఈ రోజు కర్నూలు రైతు బజార్‌లో కిలో టమోటా ధర కేవలం 14 రూపాయలు మాత్రమే. అదే బహిరంగ మార్కెట్లో 16 రూపాయలుగా ఉంది. దీనిని బట్టి చూస్తే చెన్నైలో తుఫాను ప్రభావం వల్ల.. ఆస్పరి టమోటా మార్కెట్లో ధరలు పెరుగుతాయి అన్నమాట.

అదే టమోటా కర్నూలు, పత్తికొండ, ప్యాపిలి మార్కెట్లలో ధరలు సాధారణ స్థితిలో ఉన్నాయి. కిలో 15 రూపాయలకు మించి లేవు. అదే ఆస్పరి హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమోటా ఇరవై రూపాయలు పలుకుతుండటం విశేషం. తెలుగు రాష్ట్రాలలో మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లాలో అత్యధికంగా టమోటా పండిస్తారు. పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాలలో ఎక్కువగా టమోటా పంట పండిస్తారు. మొన్నటి వరకు 200 పలికింది. 20 రోజుల్లోనే కిలో టమోటా 50 పైసలకు పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 15 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతోంది. దీని బట్టి చూస్తే టమోటా క్రయవిక్రయాలలో వ్యత్యాశం, హెచ్చుతగ్గులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది.