ఊరించి.. ఉసూరుమనిపించింది.. ఆకాశానికి అంటిన ధరలు ఒక్కసారిగా నేలమీదికి చేరిపోయాయి. పండించిన రైతుల్లో ఆశలు రేపిన టమోట ధరలు ఇప్పుడు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. ఒక్కసారిగా టమాట ధరలు కుప్పకూలిపోయాయి. స్టాక్ మార్కెట్ కంటే దారుణంగా పడిపోయాయి. నిన్నటి వరకు రెండంకెళ్లో ఉన్న ధర ఒక్కసారిగా రెండు రూపాయలకి పడిపోయింది. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలా తయారయ్యింది టమాట ధరల పరిస్థితి..టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరను పక్కన పెడితే.. కనీసం మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కర్నూలు పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి.. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు టమోటా ఎగుమతి అవుతుంది.
అయితే కిలో టమోటాల ధర రెండు రూపాయిలుగా పలుకుతోంది. దీంతో రైతులు బోరుమంటున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన టమోటాను అమ్మలేక, అలాగని తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్‌లోనే వాటిని పారబోస్తున్నారు. కనీస మద్దతు ధర ఉండేలా.. కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బు అయినా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అటు వరంగల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.. పది రోజుల క్రితం వరకు కిలో 40 పలికిన ధర నిన్నటి నుండి కిలో రూ. 10లకే పడిపోయింది.. ఉన్నట్టుండి ధర పడి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..టమాటను పొలం నుంచి తీసి మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం