టమాటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అస్సలు అంతుబట్టడం లేదు. వాతావరణం వేగంగా ఈ కూరగాయ ధర మారిపోయింది. ఒక్కోసారి అత్యధికంగా, మరోసారి అత్యల్పంగా ధరను నమోదు చేస్తూ.. రికార్డు సృష్టిస్తుంది టమాట. మొన్నామధ్య నాన్‌వేజ్ రేట్‌ను బీట్ చేసింది. చికెన్ రేట్ కంటే ఎక్కువ ధర పలికింది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ధరలు కొంతమేర స్వాంతన చేకూర్చాయి.
ఉన్న పంటకైనా మంచి రేటు వస్తుందన్న ఫుల్ హ్యాపీ అయిపోయారు. అయితే ఏమైందో, ఏమో తెలీదు కానీ స్టాక్ మార్కెట్‌లో షేర్ల ధరలు పడిపోయినట్లు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయాయి. ప్రతి ఏటా వేసవిలో గాని.. జూన్, జులై నెలలో గాని టమాటా రేట్లు అమాంతం పెరగడం ఇప్పటివరకు చూశాం. అలాంటిది.. ఈ ఏడాది మాత్రం అకస్మాత్తుగా వచ్చిన వర్షాలు, వరదలతో టమాటా పంటకు తీవ్ర డ్యామేజ్ జరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. మరి కొంత కాలం ఇలాంటి ధరలు ఉండాలని ఆశించారు. అయితే.. ఉన్నట్టుండి స్టాక్ మార్కెట్ మాదిరిగా ఒక్క సారిగా ధరలు పడిపోయాయి. ఎంతలా అంటే.. కనీస స్థాయికి చేరుకున్నాయి. సెంచరీ దాటిన టమాట ధరలు ఒక్కసారిగా రూ.30కి పడిపోయాయి. అయితే తాజాగా మరోసారి ధరలు పెరగడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అవును… పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమాటా ధర సోమవారం రూ.50కి పెరిగింది. మార్కెట్లో ఓ రోజు టమోటా ధర పెరగడం.. మరో రోజు తగ్గడంతో ఆందోళన చెందుతున్న రైతులు. ధరల స్థిరీకరణ చేసి.. తమను అదుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
Also Read: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య ఓపెన్ కామెంట్స్..