Tomato Price Falls: పెరిగిన దిగుబడి.. దిగొస్తున్న టమాటా ధర.. కనిష్టానికి చేరుకోవడంతో రైతుల్లో నిరాశ..

| Edited By: Surya Kala

Aug 11, 2023 | 10:45 AM

మదనపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగుచేసిన టమాటా రైతుకు కాసుల పంట మారిందనుకునే లోపు తగ్గుముఖం పట్టిన ధర రైతాంగం లో నిరాశకు కారణం అవుతోంది. 10 రోజుల క్రితం కిలో ధర ఊహకు అందని రీతిలో ఎగబాకి ఏకంగా రూ. 196 లు పలికింది. రైతుల పంట పండిందని భావించిన రైతు ఖరీఫ్ కింద సాగైన టమోటా దిగుబడి పక్క జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో ప్రారంభం కావడంతో టమోటా రికార్డ్ ధరలకు బ్రేకులు పడ్డాయి.

Tomato Price Falls: పెరిగిన దిగుబడి.. దిగొస్తున్న టమాటా ధర.. కనిష్టానికి చేరుకోవడంతో రైతుల్లో నిరాశ..
Tomatoes
Follow us on

టమోటా దిగొస్తోంది. సాగుచేసిన రైతును దిగాలు పెట్టిస్తోంది. మూడు రోజుల్లోనే మూడింతలుగా తగ్గిన టమోటా రైతాంగం ఆశలపై నీళ్ళు చెల్లుతోంది. 10 రోజుల క్రితం మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా డబుల్ సెంచరీ కొడితే నిన్న కనిష్ఠ ధర రూ. 36 కు పడిపోయింది. పక్క జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో టమోటా దిగుబడి రావడం మదనపల్లి మార్కెట్ కు బయ్యర్లు రాకపోవడం తో డిమాండ్ తగ్గింది. గిరాకీ తగ్గిన టమోటా మార్కెట్ లో ధర లేక పతనం వైపు పయనిస్తోంది. ఇతర ప్రాంతాల్లో టమోటా దిగుబడి రావడం, బయ్యర్ల నుంచి పోటీ లేకపోవడమే ధర తగ్గుముఖానికి కారణం.

టమాటా. ఇప్పుడు దోబూచులాడుతోంది. మదనపల్లి మార్కెట్లో మూడు రోజులుగా మళ్లీ అమాంతంగా పడిపోతున్న ధరతో పతనం వైపు పయనిస్తోంది. గత నెల 29,30 తేదీల్లో ఏకంగా డబుల్ సెంచరీకి చేరువైన టమోటా ఇప్పుడు కనిష్ట ధర రూ.36కు పడిపోయింది.

10 రోజుల క్రితం మదనపల్లి మార్కెట్లో ఈ పేరు వింటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఈ నెల 4 నుంచి తగ్గు ముఖం పడుతూ వచ్చిన టమోటా ధర నిన్నటికి కిలో టమోటా ధర కనిష్ఠ ధర రూ.36 కు చేరుకుంది.
ఈ నెల 4 న కిలో టమోటా గరిష్ట ధర రూ. 136 కాగా, కనిష్ఠ ధర.100 లు పలుకగా 399 మెట్రిక్ టన్నుల టమోటా మదనపల్లి మార్కెట్ కు వచ్చింది. 5న కిలో టమోటా గరిష్ట ధర రూ. 100, కనిష్ఠ ధర రూ.76 కు చేరుకోగా 195 మెట్రిక్ టన్నుల టమోటా మార్కెట్ కు వచ్చింది. 6 న గరిష్ట ధర రూ. 116 లు, కనిష్ఠ ధర రూ. 90 లుండగా ఏకంగా 404 మెట్రిక్ టన్నులు మదనపల్లి మార్కెట్ కు అమ్మకానికి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక 7 న కిలోదర గరిష్టం రూ. 112, కనిస్తం రూ.88 లు ఉండగా 299 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇక 8 న రైతులకు కాస్త ఊరట లభించేలా గరిష్ట ధర రూ 128 కనిష్ఠ ధర రూ.94 లు ఉండగా 258 మెట్రిక్ టన్నుల టమోటా మార్కెట్ కు వచ్చింది. ఇక 9 న గరిష్ట ధర రూ. 104 కనిష్ఠ ధర రూ.80 లకు పడిపోగా దిగుబడి పెరిగి ఏకంగా 351 మెట్రిక్ టన్నుల టమోటా మార్కెట్ కు వచ్చింది. ఇక నిన్న అమాంతంగా పడిపోయిన టమోటా ధర గరిష్టంగా రూ. 64 కనిష్టంగా రూ. 36 కు పడిపోయింది. 396 మెట్రిక్ టమోటా మదనపల్లి మార్కెట్ రావడంతో దిగుబడి పెరుగడం బయ్యర్స్ రాక టమోటాకు గిరాకీ తగ్గింది. దీంతో నిన్నటి నుంచి ధర దిగ్గొస్తుంది.

మదనపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగుచేసిన టమాటా రైతుకు కాసుల పంట మారిందనుకునే లోపు తగ్గుముఖం పట్టిన ధర రైతాంగం లో నిరాశకు కారణం అవుతోంది. 10 రోజుల క్రితం కిలో ధర ఊహకు అందని రీతిలో ఎగబాకి ఏకంగా రూ. 196 లు పలికింది. రైతుల పంట పండిందని భావించిన రైతు ఖరీఫ్ కింద సాగైన టమోటా దిగుబడి పక్క జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో ప్రారంభం కావడంతో టమోటా రికార్డ్ ధరలకు బ్రేకులు పడ్డాయి.

మదనపల్లి మార్కెట్ లో తగ్గుముఖం పడుతున్న ధరలకు ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో టమోటా దిగుబడి రావడంతో ధర పతనానికి కారణమంటున్న మార్కెట్ వర్గాలు బయర్స్ రావడం లేదంటున్నారు.
మదనపల్లి టమోటా మార్కెట్ కు పెరిగిన టమోటా దిగుబడితో ధరపై ప్రభావం రోజు రోజుకు కనిపిస్తోంది.
గత నెల 29, 30 న కిలో టమోటా ధర మదనపల్లి మార్కెట్ లో రూ. డబుల్ సెంచరీ కి చేరువైన టమోటా ఇప్పుడు కనిష్ఠ ధర రూ. 36 కు చేరడంతో రైతాంగం దిగాలు చెందుతోంది.

ఉన్నపళంగా ధరలు పడిపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. ఇక మదనపల్లి మార్కెట్ లో మూడు రోజుల్లోనే టమోటా ధరల్లో ఇంత భారీ తేడాకు అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మదనపల్లి మార్కెట్ కు టమోటా దిగుబడి పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు బయర్ల నుంచి పోటీ లేకపోవడం ప్రధాన కారణం అంటున్నారు. ఇతర ప్రాంతాలు, పక్క జిల్లాల్లో టమోటా దిగుబడి ప్రారంభం కావడంతోనే ధరల పతనానికి కారణమంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..