AP Bandh Highlights: ఏపీలో టీడీపీ బంద్‌.. పోలీసులు- కార్యకర్తల మధ్య తోపులాటలు.. ఉద్రిక్తంగా మారిన తెలుగు తమ్ముళ్ల నిరసనలు

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2021 | 6:30 PM

AP Bandh: ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం..

AP Bandh Highlights: ఏపీలో టీడీపీ బంద్‌.. పోలీసులు- కార్యకర్తల మధ్య తోపులాటలు.. ఉద్రిక్తంగా మారిన తెలుగు తమ్ముళ్ల నిరసనలు

AP Bandh: ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ముందస్తు అరెస్టులు..

దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది. కనిగిరి బస్టాండులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు.

ఏపీలో నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. బంద్ కోసం వస్తున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టిడిపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఛౌదరి బాబ్జీతో పాటు పలువురు టిడిపి నేతలను అరెస్టు చేసి పోలీసులు.

ఒంగోలులో బస్సులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. స్పాట్‌లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను అడ్డుకున్నారు. నేతలను, మహిళా కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వైసీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు: టీడీపీ

టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Oct 2021 06:10 PM (IST)

    పోసాని ఇంటిపై దాడిని ఎందుకు ఖండిచలేదు.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

    పోసాని ఇంటిపై దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.

  • 20 Oct 2021 06:09 PM (IST)

    టీడీపీ నేతలు పరుష పదజాలం వాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

    టీడీపీ నేతలు పరుష పదజాలం వాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కావాలనే మీడియా సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పరుష పదజాలం ఉపయోగించారంటూ.. సజ్జల పేర్కొన్నారు. దీంతోనే గొడవలు ప్రారంభమయ్యాని పేర్కొన్నారు.

  • 20 Oct 2021 06:06 PM (IST)

    బాబు హయాంలో హెరిటేజ్‌లో గంజాయి అమ్మేవారు… కొడాలి నాని

    బాబు హయాంలో హెరిటేజ్‌లో గంజాయి అమ్మేవారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ కలిసి దొంగ నాటకాలాడుతున్నారని నాని పేర్కొన్నారు.

  • 20 Oct 2021 05:45 PM (IST)

    పట్టాభి ఓ పేయిడ్ ఆర్టిస్ట్.. కొడాలి నాని

    పట్టాభి ఓ పేయిడ్ ఆర్టిస్ట్ అని కొడాలి నాని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను ఎవరు ఏమన్నా వదిలిపెట్టమంటూ మంత్రి కొడాలి నాని లోకేష్‌, చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.

  • 20 Oct 2021 05:44 PM (IST)

    ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు.. లోకేష్

    డీజీపీ వాస్తవాలు తెలుసుకోవాలని లోకేష్ సూచించారు. దాడి జరిగి 24 గంటలు గడిచింది.. ఒక్కరినీ అరెస్ట్ చేయలేదంటూ ఫైర్ అయ్యారు. గతంలో సవాంగ్ పోస్టింగ్ కోసం చంద్రబాబుకి ఎన్నోసార్లు ఫోన్ చేశారని.. ఇప్పుడు చంద్రబాబు ఫోన్ చేస్తే మాట్లాడరంటూ పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ పేర్కొన్నారు.

  • 20 Oct 2021 05:43 PM (IST)

    పోలీసులు మఫ్టీలో ఉన్నారు.. లోకేష్

    పార్టీ ఆఫీస్ కాదని.. ఒక దేవాలయమని.. అలాంటి టీడీపీ ఆలయంపై దాడి చేశారంటూ పేర్కొన్నారు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నాంటూ మండిపడ్డారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. దాడి చేస్తుండగా కొందరు మఫ్టీలో ఉన్నారన్నారు.

  • 20 Oct 2021 05:42 PM (IST)

    ఏపీలో ఎమర్జెన్సీ విధించాలి.. లోకేష్

    ప్రశ్నించే వారిని ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని కోరారు. డీజీపీ, వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. డీజీపీ ఆఫీస్ సీఐపై దాడి చేయకుండా పంపితే.. మా మీద కేసులు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పేర్కొన్నారు.

  • 20 Oct 2021 05:12 PM (IST)

    డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్ గా ఏపీ.. లోకేస్..

    ఏపీ డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిందని నారా లోకేష్‌ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ లీగల్ అయ్యాయంటూ ఆరోపించారు.

  • 20 Oct 2021 05:09 PM (IST)

    ఏపీ పోలీసుల చేతకానితనం వల్లే గంజాయి పెరిగింది.. లోకేష్

    ఏపీ పోలీసుల చేతకానితనం వల్లే రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాల అనంతరం బుధవారం సాయంత్రం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు.

  • 20 Oct 2021 04:42 PM (IST)

    కర్త, కర్మ, క్రియ మొత్తం చంద్రబాబే.. సజ్జల

    పట్టాభి వల్లే రాష్ట్రంలో ఋ పరిస్థితి నెలకొందని వైసీపీ నేత సజ్జల పేర్కొన్నారు. నిన్నటి దాడులకు చంద్రబాబే కారణమని ఆయన పేర్కొన్నారు. పట్టాభి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదంటూ సజ్జల పేర్కొన్నారు.

  • 20 Oct 2021 04:40 PM (IST)

    పట్టాభి నివాసం వద్ద ఉద్రిక్తత…

    టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా పట్టాభి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో పట్టాభి ఇంటి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • 20 Oct 2021 04:09 PM (IST)

    70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు..

    మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై నిన్న జరిగిన దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం జరిగిన దాడిలో బద్రి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అతను చేసిన ఫిర్యాదుతో ఏడు సెక్షన్ల కింద 70 మంది వైసీపీ కార్యకర్తలపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు.

  • 20 Oct 2021 04:06 PM (IST)

    లోకేష్ పరామర్శ..

    గాయపడిన కార్యకర్తలును టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పరామర్శించారు. కేంద్ర కార్యాలయం వద్దకు గాయపడిన కార్యకర్తలను అంబులెన్సులో తీసుకువచ్చారు.

  • 20 Oct 2021 03:39 PM (IST)

    టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత

    టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గాయపడిన కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గాయాలు చూపించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తుండగా వారిని పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, తెదేపా నేతలు రోడ్డుపై వెళ్లి అంబులెన్సును విడిపించారు.

  • 20 Oct 2021 03:09 PM (IST)

    చంద్రబాబుకు అమిత్‌ షా అపాయిట్మెంట్

    ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు కు అమిత్‌ షా అపాయింట్మెంట్ ఖరారైంది. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి షాను చంద్రబాబు కలవనున్నారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.

  • 20 Oct 2021 02:51 PM (IST)

    నారా లోకేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. 

    నారా లోకేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. ఆయనతోపాటు మరో 70 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు..
  • 20 Oct 2021 02:17 PM (IST)

    శనివారం అమిత్ షాను కలవనున్న చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఢిల్లీకి పయనంకానున్నారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడులు, నాయకుల ఇళ్లపై దాడుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి వివరించనున్నారు. 36 గంటల దీక్ష అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో పరిస్థితుల గురించి వివరించనున్నారు.

  • 20 Oct 2021 01:54 PM (IST)

    పలాసలో వైసీపీ నిరసన ర్యాలీలో అపశృతి

    టీడీపీ ఇచ్చిన బంద్‌కు నిరసనగా వైసీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీలో చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్త బొంపల్లి శ్రీనివాస్ ఒంటికి మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

  • 20 Oct 2021 01:10 PM (IST)

    పట్టాభి వ్యాఖ్యలను ఖండించిన మోపిదేవి వెంకటరమణ

    ఏపీలో టీడీపీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. పట్టాభి వ్యాఖ్యలను ఖండించారు వైసీపీఎ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా దిగజారలేదని అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను అందరూ ఖండించాలని అన్నారు.

  • 20 Oct 2021 12:30 PM (IST)

    రోడ్లపై టైర్లు కాల్చి టీడీపీ కార్యకర్తల నిరసన

    ఏపీలో బంద్‌లో భాగంగా టీడీపీ నేతల ఆందోళన కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు. మరో వైపు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రభాకర్‌ చౌదరిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

  • 20 Oct 2021 11:35 AM (IST)

    పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసం : యనమల

    రాష్ట్రం ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే టీడీపీ కార్యాలయాలపై విధ్వంసాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

  • 20 Oct 2021 11:29 AM (IST)

    మాజీ మంత్రి అమర్నాత్‌రెడ్డి హౌస్‌ అరెస్టు

    టీడీపీ బంద్‌లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాత్‌రెడ్డి, పుంగనూరులోటీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

  • 20 Oct 2021 11:27 AM (IST)

    చంద్రగిరిలో పులివర్తి నాని అరెస్టు

    చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్‌ టవర్‌ వద్ద ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పులివర్తి నానితో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు.

  • 20 Oct 2021 11:02 AM (IST)

    తాటిచెట్లపాలెం జాతీయ రహదారి పై వైసీపీ శ్రేణుల నిరసన

    ఒక వైపు టీడీపీ నిరసనలు తెలుపుతుంటే మరోవైపు వైసీపీ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు. తాటిచెట్ల పాలెం జాయతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

  • 20 Oct 2021 10:30 AM (IST)

    ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అరెస్టు

    శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కవిటి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

  • 20 Oct 2021 10:09 AM (IST)

    టీడీపీ, పోలీసుల మధ్య తోపులాట

    ఏపీలో వైసీపీకి నిరసనగా టీడీపీ బంద్‌ కొనసాగుతోంది. ఆయ ప్రాంతాల్లో బస్టాండ్‌ వద్ద నిరసనగా దిగారు. బస్సులు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

  • 20 Oct 2021 09:36 AM (IST)

    వైసీపీపై ఫిర్యాదు చేసిన పట్టాభి భార్య

    నిన్న పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఫర్నిచర్‌ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో పట్టాభి భార్య, టీడీపీ నేతలు వైసీపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి తెగబడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • 20 Oct 2021 09:33 AM (IST)

    అనకాపల్లి పర్యటన వాయిదా వేసుకున్న లోకేష్‌

    విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ముందస్తు అరెస్టు కొనసాగుతున్నాయి. ఈ రోజు నారా లోకేష్‌ అనకాపల్లి పర్యటన ఉండగా, రాష్ట్ర బంద్‌ కారణంగా వాయిదా వేసుకున్నారు.

  • 20 Oct 2021 08:50 AM (IST)

    నరసరావుపేటలో టీడీపీ నేతల ర్యాలీ

    వినుకొండ, నరసరావుపేటలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నరసరావుపేటలో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. దీంతో చదలవాడ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేశారు. రేపల్లె ఆర్టీసీ డిపో దగ్గర టీడీపీ ఆందోళనకు దిగింది. ఆర్టీసీ బస్సులను అడ్డకున్నవారిని ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు పోలీసులు.

  • 20 Oct 2021 08:40 AM (IST)

    పోలీసుల బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు

    ఏపీలో వైసీపీ దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. కార్యకర్తలు టీడీపీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసుల బందోబస్తుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తిరుగుతున్నాయి. బస్సులను అడ్డుకున్నవారిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు.

  • 20 Oct 2021 08:26 AM (IST)

    ఎక్కడికక్కడే అరెస్టులు

    ఏపీ టీడీపీ బంద్‌లో నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనతో రోడ్లపైకి వచ్చిన వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు పోలీసులు.

  • 20 Oct 2021 07:57 AM (IST)

    ఒంగోలులో ఉద్రిక్తత

    రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒంగోలులో బస్సులను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు… టీడీపీ నేతలను, మహిళా కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు.

  • 20 Oct 2021 07:52 AM (IST)

    ఉండవల్లి నివాసంలో చంద్రబాబు, లోకేష్‌

    చంద్రబాబు, లోకేష్‌లు ఉండవల్లి నివాసంలో ఉన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్‌కు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.

  • 20 Oct 2021 07:50 AM (IST)

    దేవినేని ఉమ అరెస్టు

    ఏపీ బంద్‌లో భాగంగా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గొల్లపూడిలో దేవినేని ఉమను అరెస్టు చేశారు పోలీసులు. ఉమ అరెస్టుపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట నెలకొంది.

  • 20 Oct 2021 07:48 AM (IST)

    చంద్రబాబు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

    ఏపీ బంద్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

  • 20 Oct 2021 07:32 AM (IST)

    మైదుకూరులో పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అరెస్టు

    మైదుకూరులో బందు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతుండటంతో ఆయనతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

  • 20 Oct 2021 07:26 AM (IST)

    ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద పోలీసులు..

    అనంతపురం జిల్లా తాడిపత్రి, హిందూపురంలో సాధారణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం ఉంది. ఇక జేసీ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

     

  • 20 Oct 2021 07:17 AM (IST)

    వైసీపీ కార్యకర్తలకు ఇంత వరకు అరెస్టు చేయలేదు..

    టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

  • 20 Oct 2021 07:13 AM (IST)

    శ్రీకాకుళంలో ముందస్తు అరెస్టులు

    శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. బంద్ కోసం వస్తున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టీడీపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఛౌదరి బాబ్జీతో పాటు పలువురు టిడిపి నేతలను అరెస్టు చేసి పోలీసులు.

  • 20 Oct 2021 07:11 AM (IST)

    బస్సు డిపోల వద్ద భారీ భద్రత

    బంద్‌, ఏపీలో నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టు దిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు

  • 20 Oct 2021 07:08 AM (IST)

    పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట

    గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఆందోళనకు దిగింది. బస్సులను బయటకు వెళ్లనీయకుండా నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతోంది.

  • 20 Oct 2021 07:05 AM (IST)

    నర్సాపురంలో కనిపించని బంద్‌

    ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో బంద్‌ ప్రభావం కనిపించలేదు. బస్టాండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

  • 20 Oct 2021 07:02 AM (IST)

    కళావెంకట్రావు హౌస్‌ అరెస్టు

    రాజాంలో కిమిడి కళావెంకట్రావును హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో భాగంగా ముందస్తుగా పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని హౌస్‌ అరెస్టు చేశారు.

  • 20 Oct 2021 07:01 AM (IST)

    ఎంపీ రామ్మోహన్‌నాయుడు అరెస్టు

    ఏపీ బంద్‌లో భాగంగా బస్టాండు ప్రాంతాల్లో టీడీపీ నేతల, కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎంపీ రామ్మోహన్‌నాయుడును పోలీసులు అరెస్టు చేశారు.

  • 20 Oct 2021 06:50 AM (IST)

    బస్టాండ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత

    బంద్‌ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు.

  • 20 Oct 2021 06:49 AM (IST)

    బస్సులను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు

    ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు బస్టాండ్ల వద్ద నిరసనలకు దిగారు. బస్సులు తిరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

  • 20 Oct 2021 06:47 AM (IST)

    నేతల అరెస్టులు

    రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది.

  • 20 Oct 2021 06:44 AM (IST)

    రోడ్లపైకి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

    వైసీపీ నేతల దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది టీడీటీ. దీంతో టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చిన నిరసన కొనసాగిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

     

Follow us on