Midhun Reddy – Chandrababu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆటలు ఇక మా వద్ద సాగవని తేల్చి చెప్పారు వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డి. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు అందించి తీరుతామని ఎంపీ శపథం చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం వల్ల నష్టపోయ్యే ప్రతి రైతుకు పరిహారం ఇస్తామన్నారు. అటు, మరో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఈ మేరకు విజయసాయి వరుస ట్విట్లు చేశారు. “రాయలసీమలో అడుగు పెడితే చంద్రబాబును జనం చితక్కొట్టేలా ఉన్నారు. కోస్తాకు వస్తే కారం పెడతారు. ఉత్తరాంధ్రకొస్తే ఉతికి ఆరేస్తారు. అందుకే హైదరాబాద్ అద్దాలమేడలో దాక్కున్నాడీ టూరిస్ట్ పొలిటీషియన్” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
“ఉచిత విద్యుత్తు, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, ఇందిరమ్మ ఇళ్లు, 84 నీటి పారుదల ప్రాజెక్టులు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దివంగత మహానేత వైఎస్సార్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. ఆయన జన్మదినం పది కోట్ల తెలుగు ప్రజలకు పండగ రోజు” అంటూ విజయసాయిరెడ్డి అంతకుముందు మరో ట్వీట్ చేశారు.
Read also: AP HC: జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే..!